–మాతంగి రాము
— కలెక్టర్ కు వినతి
Marriguda MEOs : ప్రజాదీవెన నల్గొండ : చింతపల్లి, మర్రిగూడ ఎంఈఓ లు, వీటి నగర్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్, పి ఆర్ టి యు చింతపల్లి మండల ప్రధాన కార్యదర్శి బసవరాజు శ్రీనివాస్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్లగొండ పట్టణానికి చెందిన బీజేవైఎం నాయకులు మాతంగి రాము గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
పదవ తరగతి స్టడీ అవర్స్ జరుగుతున్న సమయంలో వీటి నగర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పీఆర్టియు మండల ప్రధాన కార్యదర్శిగా బసవరాజు శ్రీను ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలో ఇద్దరు ఎంఈఓ లు పాల్గొనడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
మండల విద్యాధికారులుగా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఎంఈఓ లు ఒక ఉపాధ్యాయ సంఘానికి వత్తాసు పలుకుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. ఒక ఉపాధ్యాయ సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్కూల్ ఆవరణలో నిర్వహించేందుకు హెడ్మాస్టర్ ఎలా అనుమతి ఇచ్చారని రాము ప్రశ్నించారు. నిబంధనలను అతిక్రమించిన ఎంఈఓ లు, వీటి నగర్ హెడ్మాస్టర్, బసవరాజు శ్రీనివాసులుపై పలు ఉపాధ్యాయ సంఘాలు డిఈఓ కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. వారిపై వచ్చిన ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాతంగి రాము డిమాండ్ చేశారు.