*రాంగ్ రూట్ ప్రయాణం ప్రమాదాకారం: ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్
Road Accidents Control : ప్రజా దీవెన, కోదాడ: రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. కోదాడ పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలో వాహన దారులు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు పలు వాటిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ మాట్లాడుతూ వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు నిబంధనలు పాటించాలని తెలిపారు. రాంగ్ రూట్ ప్రయాణలు అసలు చేయవద్దని వాహన చోదకులకు సూచించారు.
నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పమన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. బైకులకు సైలెన్సర్లు తీసేసి వాహనం నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట సిబ్బంది ఆటో డ్రైవర్ తదితరులు పాల్గొన్నారు