–దేశ వ్యాప్తంగా నిరసనలకు వైద్యుల సమాయత్తం
–కోల్ కతా జూడాపై లైంగికదాడికి నిరసన 24 గంటల పాటు ఓపీ సేవ లు బంద్
Medical services: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కోల్ కతా లో జూనియర్ డాక్టర్ (Junior Doctor in Kolkata)పై జరిగిన లైం గిక దాడిని నిరసి స్తూ వైద్యులు ఆం దోళనలు చేస్తున్న విషయం తెలిసిం దే. రేపు దేశవ్యాప్తంగా నిరసన తెల పాలని ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ నిర్ణయించింది. రేపు ఉద యం 6 గంటల నుంచి దేశవ్యాప్తం గా ఓపీ సేవలను (OP Services) ఉపసం హరించు కుంటున్నట్లు తెలిపింది. కాగా, అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సేవలు యథావిధిగా పనిచేస్తాయని వె ల్లడించింది. రాష్ట్ర శాఖలతో సమావేశం అనంతరం ఐఎమ్ ఏ ఈ నిర్ణయం ప్రకటించింది. ఆది వారం ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు ఉపసంహరించు కుం టున్నామని పేర్కొంది.
తొలుత మా ప్రాణాలు కాపాడండి… కోల్ కత్తా లో ట్రైనీ డాక్టర్ (Trainee Dr) పై లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ నిమ్స్ వైద్యులు, సిబ్బంది ఓపీ సేవలను బహిష్కరించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ (demand)చేశారు. నింది తులను కఠినంగా శిక్షించాలన్నారు. విధుల నిర్వహణలో రక్షణ కల్పిం చాలని నినాదాలుచేశారు. అయితే తమ నిరసన కారణంగా అత్యవ సర సేవలకు ఆటంకం ఉండదని చెప్పారు. వైద్య సిబ్బంది (Medical staff)రక్షణకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాల న్నారు. “దేశంలో మహిళ డాక్టర్లకు రక్షణ లేకుండా పోయింది. ఏదైనా జరిగినప్పుడే పార్టీల నేతలు స్పం దిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అంతా మరిచిపో తున్నారు. డ్రాఫ్ట్ బిల్లులు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. ముందు మా ప్రాణా లు కాపాడండి, తర్వాత రోగుల ప్రా ణాలు కాపాడుతారని డాక్టర్లు తెలి పారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు… తెలంగాణ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు ఉన్నా జిల్లా కేంద్రాల్లో వైద్యులు నిరసనలకు దిగారు. ఆసిఫాబాద్, అదిలాబాద్, రామ గుండం, నిర్మల్, భద్రాద్రి, మేడ్చల్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ తదితర మెడికల్ కళాశాల ఆవర ణల్లో నిరసన గళం విప్పారు.