MEIL Director Sudha Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: పోలీసు ల సేవలు నిరుపమానమని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్) డైరెక్టర్ పీ సుధారెడ్డి పేర్కొన్నారు. రేయన కా పగలనకా ప్రజల భద్రతకు పోలీ సులు చేస్తున్న కృషి వేలకట్టలేనిద న్నారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలోని అమెరికన్ కాన్సు లేట్ కార్యాలయం వద్ద భద్రతా వి ధులు నిర్వర్తించే తెలంగాణ స్పెషల్ పోలీసులు విశ్రాంతి తీసుకునేందు కు అవసరమైన భవన నిర్మాణాన్ని ఎంఈఐఎల్ సొంత ఖర్చులతో చేప ట్టిందని, అమెరికన్ కాన్సులేట్ ఎ దురుగా కేటాయించిన స్థలంలో ఈ భవన నిర్మాణానికి శనివారం ఎం ఈఐఎల్ డైరెక్టర్ పీ.సుధారెడ్డి శం ఖుస్థాపన చేశారు.
50 మంది భద్రతా సిబ్బంది విని యోగించుకునేలా ఈ భవనాన్ని డి జైన్ చేశారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్దతి లో త్వరగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పోలీస్ సిబ్బందికి ఎం ఈ ఐ ఎల్ అందించనుంది. ఈ శంఖు స్థాపన కార్యక్రమంలో బెటాలియ న్స్ అదనపు డి జీ పీ సంజయ్ కు మార్ జైన్, మాదాపూర్ డీసీపీ రితి రాజ్ , కొండాపూర్ బెటాలియన్ క మాండెంట్ ఎం రామకృష్ణ , అసిస్టెం ట్ కమాండెంట్‌లు ఎం.పార్ధసారధి రెడ్డి, ఎస్.రాంబాబు, అమెరికన్ కా న్సులేట్ భద్రతా అధికారులు వెంక ట్, సతీష్,రవిచందర్ రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లా డుతూ తానూ ప్రపంచమంతా ప ర్యటిస్తుంటాన్ని అయితే ఇక్కడ ఉ న్నంత భద్రత అక్కడ కనిపించింద న్నారు. తన స్నేహితులు పలువురు వారి కుటుంబ సభ్యులతో కలిసి లే దా ఒంటరిగా హైదరాబాద్ పర్యట నకు వచ్చినపుడు చాలా భద్రంగా ఉ న్నట్లుగా భావిస్తారన్నారు.
ఇదంతా పోలీస్ ల వల్లే సాధ్యం అ వుతుందన్నారు. ప్రజల రక్షణ కోసం కష్టించే పోలీసుల శ్రమ, సేవకు తగి న గుర్తింపు లభించటం లేదన్నారు. ప్రజల కోసం పనిచేసే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలి గితే ప్రజలందరూ సంతోషంగా ఉం టారన్నారు. ఎం ఈ ఐ ఎల్ సుధా రెడ్డి ఫౌండేషన్లు పోలీసులకు సహ కారం అందించేందుకు ఎపుడూ సి ద్ధంగా ఉంటాయన్నారు.
మాదాపూర్ డీసీపీ రితిరాజ్ మా ట్లాడుతూ పోలీసులు కష్టతరమైన విధులు నిర్వర్తిస్తుంటారని వారి సం క్షేమం కోసం కృషి చేయాల్సిన బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ కృషి చేస్తుందని, అదే సమయంలో స్వచ్చంద సంస్థల స హకారం కూడా ఈ విషయంలో తీ సుకుంటుందన్నారు.ప్రజలకు ఏ ఇ బ్బంది వచ్చినా సాయం చేసేందుకు పోలీస్ లు సిద్ధంగా ఉంటారని అ లాంటివారికి అండగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నా రు.
పోలీసుల సంక్షేమానికి ఎం ఈ ఐ ఎల్ చేస్తున్న కృషిని రితిరాజ్ అభి నందించారు. తమ బెటాలియన్ లో జిమ్ ఏర్పాటు చేయాల్సిందిగా కమాండెంట్ రామకృష్ణ సుధారెడ్డి ని కోరగా ప్రతిపాదన పంపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నానక్ రాంగూడలో ఉన్న అమెరిక న్ కాన్సులేట్ భవనం నలువైపులా కొండాపూర్ లోని టిఎస్ఎస్ పీ సి బ్బంది 24 గంటలు కాపలా కాస్తుం టారు.
ఒక్కో షిఫ్ట్ లో 24 మంది విధుల్లో ఉంటారు. ఇప్పటి వరకు వీరు పా త ఇనుప కంటైనర్లలో లో ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకునే వా రు. అక్కడ సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారి ఇబ్బందిని గమనించిన బెటాలియ న్స్ అదనపు డి జీ పీ సంజయ్ కు మార్ జైన్ సూచనతో బెటాలియ న్స్ కమాండెంట్ రామకృష్ణ , అసి స్టెంట్ కమాండెంట్‌లు ఎం.పార్ధ సా రధి రెడ్డి, ఎస్.రాంబాబు తదితరు లు ఎం ఈ ఐ ఎల్ యాజమాన్యా న్ని కలిసి తమ సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన స హాయ సహకారాలు అందించాల్సిం దిగా కోరారు.
ప్రజల రక్షణకు నిరంతరం కృషి చేసే పోలీసులకు సహాయ పడటంలో ఎపుడూ ముందుండే ఎం ఈ ఐ ఎ ల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సు ధారెడ్డి అందుకు తమ సమ్మతిని తె లిపారు.విశ్రాంతి గృహాన్ని విశాలం గా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒ కేసారి 50 మంది పోలీసులు విశ్రాం తి తీసుకునేలా నాలుగు ఏ సిలు, 24 ఫ్యాన్ల సౌకర్యంతో బ్యారెక్స్ నిర్మిస్తున్నారు. పోలీసులు కాలకృ త్యాలు తీర్చుకునేందుకు ప్రత్యేకం గా ఒక భవనాన్ని ఎం ఈ ఐ ఎల్ నిర్మిస్తోంది. అమెరికన్ కాన్సులేట్ భద్రతా సిబ్బందితో పాటు అక్కడ విధులు నిర్వర్తించే సైబరాబాద్ పోలీసులు కూడా ఈ భవనాలు వినియోగించుకోనున్నారు.
హైదరాబాద్ లోని అమెరికన్ కా న్సులేట్ దక్షిణ ఆసియాలోనే పెద్ద ది. ప్రతి రోజు 3500 వీసా దరఖా స్తులను స్వీకరించే సామర్ధ్యంతో తె లంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా రా ష్ట్రాల ప్రజలకు సేవలు అందించే ఈ కార్యాలయాన్ని పోలీసులు ని రంతరం కాపలా కాస్తుంటారు. వీరి సౌకర్యార్ధం ఎం ఈ ఐ ఎల్ ఈ ని ర్మాణాన్ని చేపట్టింది.
