–వచ్చే 5 రోజుల్లో బ్యాంకు గ్యారం టీలు సమర్పించాలి
–నాణ్యత ప్రమాణాల విషయంలో ఏఓలు అవగాహన కల్పించాలి
–రవాణా పరంగా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రి పా ఠి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో మిల్లర్లు పూర్తి సహ కా రం అందించాలని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ని సమావేశ మందిరంలో 2025 – 26 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై సం బంధిత శాఖల అధికారులు, జిల్లా రైస్ మిల్లర్ల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ వానాకలం ధాన్యం కొనుగోలులో రైతులు నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మిల్లులకు పంపించే విధంగా జిల్లా యంత్రాంగం తరఫు న అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నాణ్యత ప్రమాణాల విషయంలో వ్యవసాయ విస్తరణ అధికారులు అన్ని మండలాలలో అందుబాటు లో ఉండి రైతులకు అవగాహన క ల్పించాలని చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యం కొను గోలు కేంద్రాలకు వస్తే తక్షణమే మి ల్లులకు పంపించే విధంగా చూడా ల ని, మిల్లర్లు తక్షణమే మిల్లులకు వ చ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకో వాలని కోరారు. ధాన్యాన్ని మిల్లుల కు తరలించడంలో ట్రాన్స్పోర్టర్లు ఇ బ్బంది పెడితే కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. హ మాలీల సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆమె అధి కారులను ఆదేశించారు.
వానాకాలం ధాన్యం కొనుగోలులో భాగంగా రైస్ మిల్లర్లు 5 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు సమర్పిం చా లని కోరారు. మిల్లర్లకు సంబంధించి న సమస్యలన్నింటిని ప్రభుత్వం దృ ష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా క లెక్టర్ ధాన్యం మద్దతు ధరపై రూ పొందించిన గోడపత్రికలను ఆవిష్క రించారు. జిల్లా రైస్ మిల్లర్ల సంఘం తరఫున ప్రజల ఆరోగ్య సంక్షేమాని కై ఎక్స్ రే యంత్రాన్ని అందించడం పట్ల జిల్లా కలెక్టర్ రైస్ మిల్లర్లను అభినందించారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్ మాట్లాడుతూ ధాన్యం కొను గోలు కేంద్రాలలో, అలాగే మిల్లుల వద్ద రైతుల నుండి కమిషన్ తీసు కున్నట్లు దృష్టికి వస్తే చర్యలు తీసు కుంటామని తెలిపారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని రైతులు తీసుకురావాలని, ఆ వి ధంగా రైతులకు అవగాహన కల్పిం చాలని అధికారులతో కోరారు.
ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల అధ్యక్ష, కా ర్యదర్శులు,ప్రతినిధులు శ్రీనివా స్, నారాయణ, భద్రాద్రి, యాదగిరి, తదితరులు మాట్లాడుతూ పూర్తి నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లు లకు పంపించాలని, పెండింగ్ లో ఉన్న ట్రాన్స్పోర్ట్ చార్జీలను ప్రభు త్వం ద్వారా వెంటనే చెల్లించే ఏర్పా టు చేయాలని, గోదాముల్లో, బి య్యం నిల్వ ఉంచేందుకు కేటాయిం పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి వెం క టేష్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికా రి శ్రవణ్, మార్కెటింగ్ ఏడి ఛాయా దేవి, మిల్లర్ల ప్రతినిధులు, తదితరు లు ఈ సమావేశానికి హాజరయ్యా రు.