Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ExMinister Jagadish Reddy : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ దుర్భిక్షం

–కాంగ్రెస్ వచ్చి కరువు తనవెంట తెచ్చింది

–రైతు సమస్యలపై మంత్రులకు సోయిలేదు

–కెసిఆర్ హయాంలో వ్యవసాయం స్వర్ణయుగం

–2017 నాటికి 40 లక్షల టన్నుల ధాన్యాన్ని అందించాo

–విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం

ExMinister Jagadish Reddy : ప్రజాదీవెన నల్గొండ : తెలం గాణ రాష్ట్రంలో మళ్లీ దుర్భిక్షం వచ్చిందని, కాంగ్రెస్ వచ్చి కరువు తీసుకు వచ్చిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తీరు పై ధ్వజమెత్తారు. శుక్రవారం నల్ల గొండ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్షం మళ్లీ వచ్చిందని ఆవేదన చెందారు.

కాంగ్రెస్ వచ్చాకే కరువు వచ్చిందని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ హయాంలో వ్యవసాయం స్వర్ణయుగంలా ఉండేదని 2017 నాటికి 40 లక్షల టన్నుల ధాన్యాన్ని అందించినట్లు పేర్కొన్నా రు. నల్గొండ జిల్లాలో వ్యవసాయని పండుగలా మార్చామని, అప్పు డు సమీక్షలు పెడుతూ అనుక్షణం అప్రమత్తంగా ఉండి అన్నదాత లకు బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సమకూర్చిందని అన్నారు.

దురదృష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఇద్దరు మంత్రులు వున్నా సమీక్షలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఒరిగింది శూన్యమని రైతులు హరిగోస తీస్తున్నారని మం డిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అన్ని రంగాలలో విఫలం చెందాలని విమర్శించారు. రైతులను అన్ని రకాలుగా మోసం చేశారని ధ్వజమె త్తారు.నేటికీ రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని, ధాన్యం కొ నుగొళ్లు లేవని, బోనస్ అందక రైతులు అప్పుల పాలయ్యారని ఆగ్ర హం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం కూడా రైతులకు రుణమాఫీ కాలేదని మంత్రులు కమిషన్లు తీసుకుంటూ దళారులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో ధాన్యానికి మద్దతు ధర రావడంలే దని, బిఆర్ఎస్ హయాంలో మిలన్ ల వద్ద ఉండి పర్యవేక్షణ చేస్తూ రైతులకు మద్దతు ధర అందించినట్లు గుర్తు చేశారు. నేడేమో మిల్ల ర్లు దళారుల వద్ద కమిషన్లు మంత్రులు కమిషన్లను తీసుకుంటూ రైతులను నట్టేట ముంచుతు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నల్లగొండ జిల్లాలో ఎక్కడ కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, బోనస్ అంశం బోగస్ అయిందని విమర్శించారు.నల్గొండ లో ఓ మం త్రి కి సోయి లేదు.ఎప్పుడు మైకం లో వుంటుండు.రైతులంటే లెక్క లేదు.కమీషన్లు దందా లో నిమగ్నమయ్యాడు. ఎవ్వరు ప్రశ్నిస్తే వారి పై కేస్ లు పెట్టి భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. గాల్లో హెలికాప్టర్ లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలు పట్టించు కోవడం లేదు. అధికారులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా మాట్లాడు తున్నారన్నారు.

జిల్లా కలెక్టర్ నిబంధనలు ప్రకారం నడుచుకోవాలి. అంతే కానీ కాం గ్రెస్ కార్యకర్తలగా మాట్లాడొద్దని పేర్కొన్నారు. జిల్లా మంత్రి సోయి లేకుండా తిరుగుతున్నాడని, పోలీసులు కూడా అతి చేయొద్దని చ ట్టం ప్రకారం నడుచుకోవాలన్నారు. బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోమని, అధికారులు నిబంధనల ప్రకారం నడు చుకోవాలి,ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతు లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మం దడి సైదిరెడ్డి బిఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు తండు సైదులు గౌడ్, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, నిరంజన్ వలి, బోనగిరి దేవేందర్, అయితగోనీ యాదయ్య, దీప వెంకటరెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, జాఫర్ అలీ, ప్రసన్నకుమార్, అవిటి కృష్ణ, కొండూరు సత్యనారా యణ, జమాల్ ఖాద్రి, మారగోని గణేష్ గౌడ్, తదితరులు పాల్గొ న్నారు.