Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Energy Minister Jagdish Reddy is angry with PCC leader Revanth పిసిసి నేత రేవంత్ పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు

--మూడు గంటల కరెంటా, మూడు పంటలకు కరెంటా అనడం పై --1995 నుండి 2004 వరకు,2004 నుండి 2014 వరకు ఫైల్స్ పై చర్చ జరగాల్సిందె --పవర్ హాలిడేలు ప్రకటించి సంక్షోభం సృష్టించిన ఘనత కాంగ్రెస్ --కాంగ్రెస్ దుర్మార్గాలకు నల్లగొండ జిల్లా నాశనం అయ్యింది --విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అవగాహన లేకనే అవాకులు చెవాకులు -- మీడియా సమావేశంలో కాంగ్రెస్ పై ధ్వజమెత్తిన జగదీష్ రెడ్ది

పిసిసి నేత రేవంత్ పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు

–మూడు గంటల కరెంటా, మూడు పంటలకు కరెంటా అనడం పై

–1995 నుండి 2004 వరకు,2004 నుండి 2014 వరకు ఫైల్స్ పై చర్చ జరగాల్సిందె

–పవర్ హాలిడేలు ప్రకటించి సంక్షోభం సృష్టించిన ఘనత కాంగ్రెస్

–కాంగ్రెస్ దుర్మార్గాలకు నల్లగొండ జిల్లా నాశనం అయ్యింది

–విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అవగాహన లేకనే అవాకులు చెవాకులు
— మీడియా సమావేశంలో కాంగ్రెస్ పై ధ్వజమెత్తిన జగదీష్ రెడ్ది

 

ప్రజా దీవెన/నల్లగొండ: విద్యుత్ ఫైల్స్ ఓపెన్ కు ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (jagadeesh Reddy )స్పష్టం చేశారు. పారదర్శకతకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పెట్టింది పేరు అని ఇందులో దాపరికం అంటూ ఏమి లేదని ఆయన తేల్చిచెప్పారు. అయితే అదే సమయంలో ఫైల్స్ పై చర్చ జరగాలని సవాల్ విసిరిన పిసిసి నేత రేవంత్ రెడ్డి (revanth Reddy) మాజీ బాస్,తాజా బాస్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు, వై ఎస్ పాలనలో జరిగిన ఒప్పందాల ఫైల్స్ పై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడారు.1995 నుండి 2004 వరకు చంద్రబాబు పాలనలో,2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనలోనీ ఫైల్స్ ను కుడా బహిర్గతం చేసి చర్చకు(discouss) దిగుదామని ఆయన రేవంత్ కు ప్రతి సవాల్ విసిరారు.24 గంటల విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ పార్టీ దొరికి పోయిన దొంగ అని ,ఇప్పుడు ఏ ఐ సి సి ని రంగంలోకి దించి బుజాయింపు చర్యలకు దిగుతుందని ఆయన దుయ్యబట్టారు.

ఒక అబద్దాన్ని దాచడం కోసం 100 అబద్దాలు ఆడుతున్న ఘనత ఆ పార్టీకే దక్కిందని ఆయన ఎద్దేవాచేశారు. మరోమారు దొంగ డ్రామాలతో తెలంగాణా రైతాంగాన్ని మోసం చేసే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపిందని ఆయన ఆరోపించారు.2014 కు ముందు రేవంత్ రెడ్డి కొత్త,పాత బాస్ ల కాలంలో త్రాగు నీరు(drinking water)కాదు కదా కనీసం గొంతు తడుపుకునేందుకు గుక్కెడు త్రాగు నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదని ఆయన విరుచుకుపడ్డారు.

ఏజడికో ఎందుకు కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు నాశనం అయిన నల్లగొండ జిల్లా దృష్టాంతం ఒక్కటి చక్కటి నిదర్శనమన్నారు.వీరి పాపపు పాలనకు పరాకష్టనే రెండున్నర లక్షల మంది ఫ్లోరోసిస్(flirosis )వ్యాధి గ్రస్తులు అయ్యారు అని ఆయన ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఏనాడైనా వరుసగా రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన చరిత్ర 2014 కు ముందు రికార్డ్ అయ్యిందా అని ఆయన కాంగ్రెస్ (congress) నేతలను నిలదీశారు. వీరి పాలనలో మొదటి పంటకు నీళ్లు ఎంత ఇచ్చారు.

సాగులోకి ఎంత వచ్చింది.రెండో పంట కు ఎన్ని సార్లు నీళ్లు ఇచ్చారు.ధాన్యం ఉత్పత్తి ఎంత అయ్యింది అన్న లెక్కలు కుడా బయట పెట్టి చర్చించాల్సిందే నన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) అధికారం లోకి వచ్చిన మీదట నే సాగర్(Sagar )ఎడమ కాలువ కింద భూములకు వరుసగా 16 పంటలకు నీళ్లు ఇచ్చామని దాని ఫలితమే ధాన్యం ఉత్పత్తిలో రికార్డ్ (record )సాదించడం అన్నారు.అది ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితమే నని ఆయన కొనియాడారు.

తెలంగాణా రైతాంగాం చైతన్యవంతులని వారి ముందు కాంగ్రెస్ పార్టీ జిమ్మిక్కులు చెల్ల నెరవన్నారు.24 గంటల విద్యుత్ పై ఏ ఐ సి సి అదేశాలనే టి పి సి సి పాటిస్తుందని దీనిపై చర్చ జరగాల్సిందే నన్నారు.అందుకు రైతు వేదికలు, రచ్చ బండలు వేదిక అవుతాయన్నారు.ఏ రూట్ లో వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎదుర్కొనేందుకు ఇక్కడి రైతాంగం (formers)   ఉన్నారన్నారు. మూడు గంటల కరెంట్  పై (power) కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు .అదే సమయంలో మూడు పంటలకు నీళ్ళు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షాన రైతాంగాం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.