Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komati Reddy Venkata Reddy : ప్రజాప్రభుత్వంలో ఆడంబరాల కన్నా ప్రజావసరాలే ప్రధానం

–దేశ, విదేశీ అతిథుల అతిధ్యం కో సం బేగంపేటలో అతిధిగృహం

–అతిథులకు ఫైవ్ స్టార్ హోటల్స్ రూ. కోట్ల ఖర్చును అరికడతాం

–ప్రజాధనాన్ని ఒక్క రూపాయి కూ డా వృధా కానివ్వo

–ఆధునీకరించిన స్టేట్ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి

Minister Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజా ప్ర భుత్వంలో మాకు ఆడంబారాల క న్న ప్రజా అవసరాలు తీర్చడమే ప్ర ధానమని, ప్రజాధనాన్ని ఒక్క రూ పాయి కూడా వృధా కానివ్వమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చే శారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం క్యాంపు ఆఫీసుగా వినియోగించి న బేగంపేటలోని ప్రజాభవన్ ఆవరణ లో పునరుద్ధరించిన స్టేట్ గెస్ట్ హౌ స్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో కలిసి మం త్రి వెంకటరెడ్డి ప్రారంభించారు.కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే అతిధులకు, విదే శాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఈ స్టేట్ గెస్ట్ హౌస్ ని వినియోగంలోకి తేవడం జరిగిందని తెలిపారు . ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అతి థిల కోసం హోటళ్లలో గదులు కేటా యించి ప్రజాధనం వృధా చేయకుం డా స్టేట్ గెస్ట్ హౌస్ ను వినియోగి స్తామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే అతిథులకు ఫైవ్ స్టా ర్ హోటల్స్ లో స్టేలు ఇచ్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చే సిందని ఆరోపించారు. గత కాంగ్రె స్ ప్రభుత్వంలో సీఎం క్యాంపు ఆఫీ సుగా వినియోగించిన భవనాన్ని ఆధునీకరించి స్టేట్ గెస్ట్ హౌస్ గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
స్టేట్ గెస్ట్ హౌస్ లో అన్ని వసతు లతో మైమరిపించేలా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభు త్వంలోని అధికారులు, వేరే రాష్ట్రా ల నుంచి వచ్చే అతిధులకు, విదే శాల నుంచి వచ్చే అతిథులకు ఆతి థ్యం ఇవ్వడం కోసం ఈ స్టేట్ గెస్ట్ హౌస్ ని వినియోగంలోకి తేవడం జరిగిందని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా స్టేట్ గెస్ట్ హౌస్ ను స కల సౌకర్యాలతో ఫైవ్ స్టార్ హోట ల్ లో మరిపించేలా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం రా ష్ట్రానికి వచ్చే అతిథులకు ఫైవ్ స్టా ర్ హోటల్స్ లో ఆతిధ్యం ఇచ్చి కో ట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. అదే సమయంలో మేం ఎలాంటి ఖర్చు లు లేకుండా సకల సౌకర్యాలతో కూడిన స్టేట్ గెస్ట్ ను వినియో గంలోకి తెచ్చామని గుర్తు చేశారు. కులాలు, మతాల పేరుతో రాజకీ యాలు చేయడం ప్రజాస్వామ్యా నికి మంచిది కాదని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.


ఆబ్ కి బార్ 400 నినాదం ఇచ్చి 240 సీట్లుకే పరిమితమైనప్పుడు ఏం చేశారని ఎద్దేవా చేశారు. నల్లధ నం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు అకౌం ట్లో లక్షల రూపాయల డబ్బులు వే స్తామని మర్చి పోయారని విమ ర్శించారు. దేశంలో రెండు కోట్ల ఉ ద్యోగాలు ఇస్తానని చెప్పారని కానీ, వాస్తవంలో దేశంలో నిరుద్యోగo పెరిగిందని, దానికి బండి సంజయ్ సమాధానం చెప్పాలని నిలదీశారు.

ఇప్పటికి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో బండి సంజయ్ తెలపా లని మంత్రి ప్రశ్నించారు.వచ్చే ఎం పీ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 కీ పైగా ఎంపీ సీట్లు గెలుచుకొని ప్రభుత్వా న్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా త క్కువ ఓట్ల తేడాతో 3 సీట్లు ఓడిం ది, లేకపోతే మాకు 12 సీట్లు వచ్చే వని వివరించారు.స్టేట్ గెస్ట్ హౌజ్ భవన ప్రారంభోత్సవంలో చీఫ్ సె క్రటరీ శ్రీమతి శాంతికుమారి, తె లంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఆర్ &బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.