Minister Komatireddy : ప్రజా దీవెన నల్గొండ : తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మామిడి తోరణాలు, పాడిపంటలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
రేషన్ కార్డున్న ప్రతీ తెలంగాణ బిడ్డకు సన్న బియ్యం అందించే సంక్షేమ కార్యక్రమం, ఉగాది పండగ సందర్భంగా రేపు సూర్యాపేటలో ప్రారంభించుకోబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ అమలు చేస్తూ.. పరిశ్రమల స్థాపన, ఉద్యోగ నియామకాలు, చక్కటి రహదారుల నిర్మాణంతో ప్రగతి దిశగా పరుగులుపెడుతున్న తెలంగాణ రాష్ట్రం.. ఈ నూతన సంవత్సరంలో మరింత వేగంగా అభివృద్ధి బాట పట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరుకున్నారు.
జీవితం.. తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు, చేదు వంటి షడ్రుచుల సమ్మేళనమని సందేశాన్నిచ్చే ఉగాది పండగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.