TIMS Hospitals Construction :మంత్రి కోమటిరెడ్డి ఆదేశం, టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం యుద్ధ ప్రాతి పదికన పూర్తి
TIMS Hospitals Construction :ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ లో టిమ్స్ ఆస్పత్రుల నిర్మా ణం పురోగతిపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రె డ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం స మీక్ష చేశారు. హాస్పిటల్ కట్టించడం అనేది మన పేదవాడి కోసం గుడి కట్టించి ఇచ్చినట్టు కాబట్టి దీనిని మనం అంతే శ్రద్ధగా క్రమశిక్షణగా పూర్తి చేయాలని మంత్రి ఈ సంద ర్భంగా వ్యాఖ్యానించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారు లతో జరిపిన సమీక్షా సమావేశం లో మాట్లాడారు.
పేద,మధ్యతరగతి,అట్టడుగు వర్గా లకు కార్పొరేట్ వైద్యం అందించే ఈ హాస్పిటల్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సూ చించారు. టిమ్స్ నిర్మాణంలో ఎ లాంటి అలసత్వం ఉండకూడదని అలాగే నాణ్యతాలోపం జరగకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు .
ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు వికాస్ రా జ్, హరిచందన, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.