Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 3:26 pm Posted by : praja deveena

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క ఆదేశాలు, నల్లగొండలో నిర్ణీత గ డువులోగా రోడ్ల పనులు పూర్తి కావాలి 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరుగుతున్న రహదారు లు, వంతెనల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్ణీత గడు వులోగా రోడ్ల పనులు పూర్తి కావా లని రోడ్లు భవనాలు, సినిమాటో గ్ర ఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మంత్రి క్యాంపు కార్యా లయం “ఇందిరాభవన్”లో ఆర్&బీ అధికారులతో సమీక్ష సమావేశం ని ర్వహించారు.

ఈ సందర్భంగా బుద్ధారం, అప్పాజి పేట, బ్రాహ్మణవెల్లంల రహదారి ప నుల పురోగతిని పరిశీలించి, రెం డు నెలల్లోగా పూర్తిచేయాలని స్ప ష్టం చేశారు.సోమనవాగుపై నిర్మా ణంలో ఉన్న పగిడిమర్రి వంతెన ప నులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇ వ్వడంతో పాటు పర్యవేక్షణను క ట్టుదిట్టం చేయాలని సూచించారు.

కనగల్ జంక్షన్ నుంచి కనగల్ గ్రా మం వరకు నాలుగు లేన్ల రహదారి పనులను వెంటనే ప్రారంభించాల న్నారు. కనగల్–తిమ్మన్నగూడెం ర హదారి పనులను వేగవంతం చే యాలని ఆదేశించారు.మామిడాల, గోదోరిగూడెం, ఎల్లమ్మగూడెం గ్రా మాల రహదారి పనులపై కూడా స మీక్ష జరిపి, మామిడాలలో సీసీ రో డ్డు పనులను తక్షణమే ప్రారంభిం చాలని స్పష్టంగా పేర్కొన్నారు.

నార్కెట్‌పల్లి, మండ్ర రహదారి ప నులను వెంటనే ప్రారంభించాలం టూ సంబంధిత కాంట్రాక్టర్‌కు కఠిన ఆదేశాలు జారీ చేశారు.వైటీపీఎస్ రహదారి పనుల పురోగతిని నల్గొం డ సూపరింటెండింగ్ ఇంజనీర్‌తో క లిసి మంత్రి సమీక్షించారు.జిల్లాలో రహదారి అనుసంధానం మెరుగు పడితేనే అభివృద్ధి సాధ్యమని మం త్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

నిర్ణయించిన గడువుల్లో పనులు పూ ర్తికాకపోతే బాధ్యులపై చర్య లు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆర్డీవో అశోక్ రెడ్డి, ఆర్&బీ సూపరింటెండింగ్ ఇంజ నీర్ శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జి క్యూ టివ్ ఇంజనీర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.