Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: సమస్యలు లేని పట్టణంగా నల్లగొండను తీర్చిది ద్దుతా మని రాష్ట్ర రోడ్డు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ ట రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురు వారం అయన నల్లగొండ మున్సి పాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు చేశారు. అన్నేశ్వరమ్మ గుట్ట వద్ద అమృత్-2 పథకం కింద కోటి నలభై ఐదు లక్షల రూపా యల వ్యయంతో నిర్మించిన 1 100 కిలో లీటర్ల తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. అదే విధం గా మూడు కోట్ల 14 లక్షల 60000 వ్య యంతో వల్లభరావు చెరు వుసుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. లెప్రసీ కాలనీలో 3 కోట్ల రూ పాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థా పన చేశారు.లతీఫ్ సాబ్ గుట్ట సమీ పంలో 50 లక్షల రూపాయల టిఏటియుఎఫ్ ఐడిసి నిధులతో నిర్మించిన ఎస్ ఈ-2 యూనిట్ కా ర్యాలయాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 68.83 లక్షల రూపా యల వ్యయంతో సుందరీకరించనున్న మోతికుంట ప నులకు శంకుస్థాపన చేశారు.
నూతనంగా ప్రారంభించిన ఎస్ ఈ కార్యాలయం వద్ద మీడియా ప్ర తినిధులతో మంత్రి మాట్లాడుతూ ఇటీ వల నిర్వహించిన అసెంబ్లీ సమా వే శాలలో నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పా టు చేస్తూ బిల్లు పాస్ చేయడం జరి గిందని, రాష్ట్ర ము ఖ్యమంత్రి , మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలి పారు. మేలో జరగనున్న మేయర్ ఎన్నికల్లో నల్ల గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు తొలి మేయర్ రానున్నారని ఆయ న వెల్లడించారు.
నల్లగొండ పట్టణంలో 272 కోట్ల రూ పాయలతో అండర్ గ్రౌండ్ డ్రై నేజీ, నీటి సరఫరా పథకాలను చేపట్టడం జరిగిందని, 53 కోట్ల రూ పాయలతో టియుఎఫ్ ఐడిసి ద్వారా రోడ్లు, మురికి కాలువల నిర్మా ణం పనులు జరుగుతున్నాయని, మరో 109 కో ట్లతో సి సి రోడ్లు, 9 కోట్ల రూపాయ లతో పట్టణం నలువైపులా సబ్ స్టేషన్లను చేపట్ట డం జరిగిందని, అందులో భాగంగా గురువారం రెండు సబ్ స్టేషన్లు ప్రారంభించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
అదే విధంగా 900 కోట్ల రూపాయ లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేప ట్టనున్నామని, మార్చిలోపు లతీఫ్ సాబ్ గుట్ట పనులను పూర్తి చేస్తా మని, అలాగే బ్రహ్మంగారి గుట్ట వద్ద అభివృద్ధి పనులు చేప ట్టడం జరిగిందని, ఎవరు ఊహించని రీతిలో నిధులను తీసుకువ చ్చి నల్గొండను అభివృద్ధి చేస్తున్నామని, భవిష్య త్తులో నల్గొండను స్మార్ట్ సిటీగా చే యాలన్నదే తనసంకల్పమని అన్నారు. కార్పొరేషన్ కావడం వల్ల నల్గొండకు రాష్ట్ర ప్రభుత్వం నుండే కాకుండా కేంద్రం ద్వారా నిధులు వస్తాయని, నల్గొండ టౌన్ ను మోడల్ టౌన్ గా చే యాలన్నదే తన లక్ష్య మన్నారు. 27 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ పనులు సైతం పూర్తి చేయడం జరిగిందన్నారు.
భవిష్యత్తులో నల్గొండ పట్టణాన్ని సమస్యలు లేని పట్టణంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో భాగం గా 60 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ,20 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల ప్రణాళిక నడుస్తున్నదని, మన్న నూరు- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వంటి వాటిని చేపట్టడం జరిగిం దని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి లెప్రసి కాలనీ వ ద్ద ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి కాంపౌండ్ వాల్ మంజూరు చేశారు. మోతికుంట అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి భవనానికి కలర్లు,ఫ్యాన్,బొమ్మలు మంజూరు చేశారు.
జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు ఇన్చార్జి కలె క్టర్,ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, ట్రాన్స్ కో చీప్ ఇంజనీర్ బాలస్వామి, నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చై ర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ప్రజారోగ్య పర్యవేక్షక ఇంజనీర్ వెంక టేశ్వర్లు, ట్రాన్స్ కో ఎస్ ఈ వెంకటేశ్వర్లు,మున్సిపల్ కమిషనర్ స య్యద్ ముసాబ్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమే ష్,నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మారగోని నవీన్డి గౌడ్, మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి , పలువురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదిత రులు ఉన్నారు.


