Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 November 2025, 10:43 am Posted by : praja deveena

Komatireddy Venkat Reddy : బిఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి ఫైర్, మొదటి టర్మ్ లో కాళే శ్వరం, రెండోటర్మ్ లో ధరణి పేరిట దోచుకున్నారు

Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో మొదటి టర్మ్ ప్రభు త్వంలో కాళేశ్వరం పేరిట దోచుకు న్న బిఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం రెండోటర్మ్ లో ధరణి పేరిట దోచు కుoదని రాష్ట్ర రోడ్లు భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రె డ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. ప్రస్తుతం ఇప్పుడు క ల్వ కుంట్ల కుటుంబంలో దోచుకున్న సొ మ్ము పంచుకునే వాటాల పంచాయ తీ నడుస్తుందని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్ని క ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు గా రహమత్ నగర్ డివిజన్ లో గు రువారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రె డ్డి వెంకట్ రెడ్డి ఇంటింటి ప్రచారం ని ర్వహించారు. గడపగడపకు తిరు గుతూ రహ్మత్ నగర్ వాసులను ఆ ప్యాయంగా పలకరించిన మంత్రి, హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అ భ్యర్థించారు. ప్రచార సమయంలో మంత్రితో పలువురు యువతీ, యు వకులు సెల్ఫీలు దిగేందుకు ఉత్సా హం చూపారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,స్థానిక నాయకు లతో కలిసి రహమత్ నగర్ చౌరస్తా నుండి పలు బస్తీల్లో ఉదయం నుం డి మధ్యాహ్నం వరకు సుదీర్ఘ సమ యం ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ప్రజలకు జరిగే మేలు ను వారికి అర్థమయ్యే రీతిలో మం త్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వివరిం చారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షే మం,అభివృద్ది అని, పేద ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి వారితో అన్నారు.

బస్తీల్లో పేదలకు మంచి జరగాలం టే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినీ పెద్ద మె జార్టీతో ఆశీర్వదించాలనీ, స్థాని కం గా ఉన్న సమస్యలు అన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులం ద రం కలిసి సమష్టిగా పరిష్కరిస్తా మ ని వారికి హామీ ఇచ్చారు. ఏళ్ల తర బడి పేరుకు పోయిన సమస్యలు ప రిష్కారం చేసుకునేందుకు జూబ్లీహి ల్స్ ప్రజలకు దక్కిన గొప్ప అవకాశ మని చెప్పారు. ప్రజల్లో ఆదరణ చూస్తుంటే నవీన్ యాదవ్ గెలుపు పక్కా అనిపిస్తుందని మెజార్టీ తేలా ల్సి ఉందన్నారు. ఒరిజినల్ సర్వేలు అన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తు న్నాయనీ, దీంతో బిఆర్ఎస్ నే త లు పూర్తి నైరాశ్యంతో మాట్లాడు తు న్నారని,వారి మోసపు మాటలు న మ్మొద్దని ఓటర్లను కోరారు.

కాంగ్రెస్ హయంలోనే హైదరాబాద్ అభివృద్ది…కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలోనే హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధి జరిగిందనీ మంత్రి పునరుద్ఘాటించారు ఇవాళ లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ వచ్చే లా అంకురార్పణ చేసిందే కాంగ్రెస్ అన్నారు. విశ్వ నగరంగా తీర్చి ది ద్దేందుకు కాంగ్రెస్ హయాంలోనే ఎ నలేని కృషి చేశామని, రాజీవ్ గాం ధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు,ఫార్మా,ఐటీ రంగా లకు ప్రోత్సాహం లాంటి ఎన్నో కా ర్యక్రమాలు చేపట్టామని అన్నారు.

రక్షణ రంగానికి కూడా హైదరాబాద్ కీలక స్థావరం అన్నారు. ఇవన్నీ కే వలం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్పుడూ మాత్రమే జరిగాయని గు ర్తు చేశారు. బిఆర్ఎస్ నేతలు ఏ మైనా అంటే ఫ్లై ఓవర్లు నిర్మించా మ ని అంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన 14కి. మీ ఒక్క పి.వి ఎక్స్ ప్రెస్ వేఫ్లై ఓవ ర్ 50 ఫ్లై ఓవర్లతో సమానమన్నారు.

బిఆర్ఎస్ నిర్మించిన చిన్న చిన్న ఏ డు,ఎనిమిది ఫ్లై ఓవర్లకు పెద్ద ప్రచా రం చేసుకుంటుందని ఎద్దేవా చేశా రు.

హైదరాబాద్ కు మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే..లక్ష కో ట్ల విలువ గల ORR ను ఎన్నికల ముందు 7వేల కోట్లకు బిఆర్ఎస్ అ మ్ముకున్నదనీ మండిపడ్డారు. తన రోడ్లు భవనాలు శాఖ పరిధిలో మ రో బృహత్తర ప్రాజెక్ట్ రీజినల్ రింగ్ రోడ్డు 30వేల కోట్ల వ్యయంతో ని ర్మించబోతున్నామని 2026 ఫిబ్ర వరి నుండి పనులు ప్రారంభం కా బోతున్నాయనీ అన్నారు. ORR నుండి రీజినల్ రింగ్ రోడ్డు స మాం తరంగా రేడియల్ రోడ్లు నిర్మించబో తున్నామని తెలిపారు. కోకాపేట, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వేలంలో ఎకరం 200కోట్లు పలికిందంటే అది కేవలం కాంగ్రెస్ ముందు చూపుతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి ఆలోచనల మేరకు ప్ర పంచంలోనే మేటి నగరంగా అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీని నిర్మి స్తున్నామని తెలిపారు.

*అసెంబ్లీకే రానోడు, రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడు…*

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమిని ముందే అంగీకరించి సెంటిమెంట్ కు,అబద్ధపు ప్రచారాలకు బిఆర్ఎస్ పార్టీ తెరలేపిందని మంత్రి తీవ్ర వి మర్శలు చేశారు. 10ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాద వ్ పై వ్యక్తిగత విమర్శలు పాల్పడు తూ పసలేని ఆరోపణలు చేస్తున్నా రని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభు త్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది 5సం వత్సరాల కోసం మేము వచ్చి 2ఏ ళ్ళు కూడా ఇంకా కాలే..ఇంకా 3ఏళ్ల సమయం ఉన్నది. అయినా కేటీ ఆ ర్ 2ఏళ్లలో కేసీఆర్ వస్తాడు అని చె ప్తున్నాడు. అసెంబ్లీకి రాని కేసీఆర్ రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తా డు. ఈ 3ఏళ్లు, వచ్చే 5ఏళ్లు తెలం గాణలో కాంగ్రెస్ పార్టీనే అధికా రం లో ఉంటుందన మంత్రి కోమటి రెడ్డి తేల్చిచెప్పారు.

*కేటీఆర్ ప్రస్టేషన్ లో ఉన్నా డు…* బి ఆర్ఎస్ ఓటమి ఖా య మని తెలిసి కేటీఆర్ ప్రస్టేషన్ లో ఉన్నాడు, ఏదేదో మాట్లాడు తున్నా డని విమర్శించారు.”ముందు నీ చె ల్లె కవిత అడిగిన దానికి సమాధా నం చెప్పు బిఆర్ఎస్ నేతల సెం టిమెంట్ మాటలు నమ్మి మోసపో తే, గోస పడతారనీ ప్రజలు ఆలో చన చేయాలనీ జూబ్లీహిల్స్ ఓట ర్ల కు విఙ్ఞప్తి చేశారు. మీ సమస్యలు అన్ని మాకు తెలుసు వాటిని ప రి ష్కరించే బాధ్యత మేం తీసుకుం టాం.కంటోన్మెంట్ లో జరుగుతున్న దానికి రెట్టింపు అభివృద్ధి జూబ్లీహి ల్స్ లో చేస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.