Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు, తెలంగాణ ప్రజలందరికి మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపి కబు రు అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయత లపెట్టిన పౌరవిమానాశ్రయానికి భా రత వాయుసేన (IAF) అంగీకారం తెలిపినట్టు మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంతకుముందు మామునూర్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు.. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు సాధించడంపట్ల ఆయన హర్షంవ్యక్తం చేశారు. ఆరు నెలల స్వల్పవ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
అదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవల ను అందుబాటులోకి తీసుకురా వా లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు (లేఖ సంఖ్య: 5608/ఎయిర్ పోర్ట్స్/2024, తేదీ: 18.12.2024) భారత వాయుసేన (IAF) వాయుసేన అధికారులు సుముఖతవ్యక్తం చేయడంతో పాటు అక్కడ భవిష్యత్తులో వా యుసేన శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు లేఖ లో తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా తెలంగాణ ప్రభు త్వానికి పౌర విమాన సేవలను ప్రా రంభించేందుకు కావాల్సిన అను మతులు మంజూరీ చేస్తున్నట్లు వా యుసేన అధికారులు లేఖ ద్వారా తెలిపినట్టు ఆయన వివరించారు.
ఈ విమానాశ్రయాన్ని పౌర విమా నయానానికి మరియు ఎయిర్ ఫో ర్స్ విమానాల రాకపోకలకు అను గుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ గా అభివృద్ధి చేయాల ని వాయుసేన సూచించినట్టు తెలి పిన మంత్రి పౌర విమానాల రాక పోకలకు అనువుగా రన్‌వే పున ర్నిర్మాణం చేయడం, పౌర టర్మినల్ ఏర్పాటు, ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్రాన్ విమానాలు నిల్చోవడానికి, మలు పులు తిరగడానికి మరియు ఇతర విమానయాన కార్యకలాపాలకు ఉపయోగించే నిర్దిష్ట ప్రాంతం) వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి పనులు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఇందుకు అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండి యా (AAI)కు సమకూర్చుకో వాల ని వాయుసేన అధికారులు లేఖలో సూచించినట్టు మంత్రి తెలియ జేశారు. అంతేకాదు, ఎయిర్ పోర్ట్ కు అవసరమైన అన్ని అనుమతు లు పొందేందుకు ఎయిర్‌పోర్ట్స్ అ థారిటీ ఆఫ్ ఇండియా డిటెయిల్డ్ ప్రపోజల్స్ ను భారత వాయుసే నకు సమర్పించాలని కోరినందున అందుకు సంబంధించిన తదుపరి కార్యాచరణను అధికారులతో సమీక్షిస్తున్నామని అతిత్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదిక ను రూపొందించి కేంద్రానికి, సంబంధిత విభాగాలకు సమర్పి స్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో మొన్న మామునూర్, నేడు ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు లకు అనుమతుల మంజూరీలో సహకరిస్తున్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పౌరవిమానయానశాఖ మం త్రి కింజారపు రామ్మోహన్ నాయు డు, రాష్ట్రంలో ఏయిర్ పోర్ట్ ల ఏ ర్పాటుకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లకు మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.