Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస క్తికర వ్యాఖ్య, పురుషులతో పాటు మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది
Minister Komatireddy Venkat Reddy :
ప్రజా దీవెన, నల్లగొండ: పురుషుల తో పాటు, మహిళలు ఆర్థికంగా ఎ దిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ కాలనీ సమీపంలో ఇం దిరా మహిళ శక్తి కార్యక్రమంలో భా గంగా జిల్లా మహిళా సమాఖ్య, ఇం డియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమి టెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సు మారు 5 కోట్ల రూపాయల వ్య యంతో ఏర్పాటు చేయనున్న మ హిళా శక్తి పెట్రోల్ పంపు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారని, తాను 2004 సంవత్సరంలో శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఒక్కో గ్రామంలో స్వయం సహాయక మహిళా సం ఘాలకు 15 కోట్ల వరకు రుణాలు ఇప్పించడం జరిగిందని మంత్రి గు ర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం మహి ళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తు న్నదని, అన్ని పథకాల లబ్ధిని మహి ళలకి ఇస్తున్నదని, ముఖ్యంగా ఉచి త విద్యుత్తు, ఉచిత బస్సు, ఇంది రమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటివి ఉదాహరణగా చెప్పారు.
మహిళా సంఘాల సభ్యులు కలిసి కట్టుగా పని చేసుకోవాలని కోరారు. ఎస్ఎల్బీసీ వద్ద ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ భవిష్యత్తులో బాగా నడుస్తుందని, మెడికల్ కళాశాల పక్కనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, నర్సింగ్ కళాశాల, ఇటు హైదరాబాద్ రహదారికి నాగార్జున సాగర్ రహదారికి చేరువలో ఉండ టం, పెట్రోల్ పంపు తో పాటు, ఏవి చార్జింగ్ మిషన్, కేఫ్ టేరియా, సూ పర్ మార్కెట్ వంటివి ఇక్కడ బాగా నడుస్తాయని అన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆ సుపత్రిని ప్రైవేట్ ఆస్పత్రికి మంచి వైద్య సేవలు అందిస్తున్నదని, ఇటీ వలే ఏఐజి ఆసుపత్రి ప్రభుత్వవైద్య కళాశాల తో పాటు, జిజిహెచ్ ను ద త్తత తీసుకున్నదని, కనగల్ లో పి హెచ్ డి లో గ్లూకోమా సెంటర్ ఏ ర్పాటు చేశామని, మహిళల ద్వారా కట్టంగూరు మండలం అయిటిపా ములలో సోలార్ విద్యుత్ యూని ట్లు ఏర్పాటు చేశామని ఈ సంద ర్భంగా ఆయన తెలిపారు.
మహిళలు బాగా పనిచేస్తే ఆర్థికంగా పురుషులతో పాటు, సమానంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెం దుతుందని తెలిపారు.
సెర్ప్ సి ఈ ఓ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మ హిళా స్వయం సహాయ సంఘాల కు 20వేల కోట్ల రూపాయల రుణా లు ఇస్తున్నామని, చిన్న సంఘాల ద్వారానే మహిళల్లో ధైర్యం వస్తుం దని, ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పు డే మహిళ ముందడుగు వేస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని స్వయం సహాయక మహిళా సంఘాలలోని సభ్యులకు ప్రతి ఇంటికి రుణం వెళ్లే విధంగా చూడాలని అన్నారు.
పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతలను మహిళలకు అప్ప గించగా, రాష్ట్రవ్యాప్తంగా 30 కోట్ల ఆదాయం వస్తే నల్గొండ జిల్లా లో కోటీ 40 లక్షల రూపాయల ఆ దాయం వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలులో సైతం 80 కోట్ల రూపా యల ఆదాయాన్ని స్వయం సహా యక మహిళా సంఘాలు రాష్ట్రం లో ఆదాయం అర్జించారని, ప్రభు త్వము మహిళల కోసం ప్రవేశపె డుతున్న పథకాలన్నీ సద్వినియో గం చేసుకోవాలని కోరారు. దీంతో పాటు ఆరోగ్యం, పిల్లల చదువు, పౌ ష్టికాహారం అందించాలని, గ్రామాల లో గృహహింసకు వ్యతిరేకంగా మ హిళలకు తోడుగా నిలవాలని, ఆ రోగ్యం, సామాజిక భద్రత చూసు కోవాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లా డుతూ ఇప్పుడిప్పుడే మహిళలు వాణిజ్య, వ్యవసాయ రంగాలలో ముందుకు వెళ్తున్నారని అన్నారు. మహిళా స్వయం సహాయక సం ఘాలకు ఇచ్చిన పెట్రోల్ పంపును సక్రమంగా నిర్వహించుకోవాలని, నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు మూడవదని, మరో మూడు పెట్రోల్ పంపులు జిల్లాకు మంజూరు అయ్యాయని తెలిపా రు.
ఐ ఓ సి ఎల్ జనరల్ మేనేజర్ సుదీ ప్ రాయ్, డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి మాట్లాడారు.స్థానిక సంస్థల ఇంచా ర్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అ మిత్, రెవెన్యూ అదనపుకలెక్టర్. జె. శ్రీనివాస్, ఇన్చార్జి డిఆర్ఓ అశో క్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ జూ పూడి రమేష్ ,డిసిసిబి డైరెక్టర్ సం పత్ రెడ్డి ,ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ,ఈ కార్యక్రమానికి హా జ రయ్యారు. ఈ సందర్బంగా మం త్రి ఫిష్ ఔట్లెట్ ను ప్రారంభించారు.