Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, మానవ సేవ కన్నా మిన్న ఏది లేదని చాటిన మహిళామణి మదర్ థెరిస్సా
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: మానవ సే వ కన్నా మిన్న ఏది లేదని చాటిన మహోన్నత మహిళామణి మదర్ థెరిస్సా అని రాష్ట్ర రోడ్లు భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కో మటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
మదర్ థెరిస్సా వర్ధంతి సందర్భంగా శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాల యం ఇందిరా భవన్ లో మదర్ థె రిస్సాచిత్ర పటానికి మంత్రి పు ష్పాంజలి ఘటించారు.
ఆమె స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ ద్వారా ప్రపంచవ్యా ప్తంగా పేదలకు, నిస్సహాయులకు సేవలు అందించారని కొనియాడా రు. ఆమె సేవలకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతి,1980లో భారతదేశ అత్యున్నత పౌర పుర స్కారమైన భారతరత్న అందుకు న్నారని గుర్తు చేశారు.
ఆమె మానవతా సేవలకు గుర్తుగా సెప్టెంబర్ 5న అంతర్జాతీయ దాతృ త్వ(చారిటీ) దినోత్సవంగా పాటి స్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మంత్రి వెంట నివా ళులు అర్పించిన వారిలో నల్గొండ ఎంపీ రఘు వీర్ రెడ్డి,ఎమ్మెల్సీ శం కర్ నాయక్ స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.