Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, నిజాంనిరంకుశత్వంపై ని ప్పురవ్వలైన త్యాగధనుల పోరాట ఫలితమే విముక్తి దినోత్సవం
Minister Komatireddy Venkat Reddy :
ప్రజా దీవెన, నల్లగొండ: నిజాం నిరం కుశత్వంపై నిప్పురవ్వ లై ఎగిసిపడి న ఎందరో త్యాగధు నుల పోరాట ఫలితం నేడు మనం అనుభవిస్తు న్న నేటి స్వాతంత్ర్యమని రాష్ట్ర రో డ్లు భవనాల శాఖామంత్రి కో మ టిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, 1948వ సంవత్స రంలో సరిగ్గా ఇదే రోజున భారత ప్ర భుత్వం ‘ఆపరేషన్ పోలో’ ని నిర్వ హించి నిరాంకుశ పాలనకు విముక్తి కల్పించిందని గుర్తు చేశారు. తెలం గాణ ప్రాంతం భారత్ యూనియన్ లో విలీనమై నేటికి 77 వసంతాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరం లోకి అడుగిడుతున్న శుభసందర్భం గా మీ అందరికి మరొక్కసారి శుభా కాంక్షలు అంటూ తెలియజేశారు.
ఇక్కడికి వచ్చిన పెద్దలు, మేధావు లు, జర్నలిస్టులు, టీచర్లు, లెక్చర ర్లు, ప్రొఫెసర్లు, కవులు, రచయిత లు ఈ పోరాట చరిత్రను మన యు వతకు తెలియజేయాల్సిన అవస రం ఎంతో ఉందన్నారు.తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం 17 సెప్టెంబ ర్ 2025 పురస్కరించుకొని బుధ వారం నల్లగొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఆయ న ముఖ్యమంత్రిగా పాల్గొని ప్రసం గించారు.
“వెట్టి నుంచి తెలంగాణ మట్టికి, ఈ ప్రాంతానికి” విముక్తి కలిగిన సెప్టెంబ ర్ 17 ను పురస్కరించుకొని తె లం గాణ ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం శుభ సందర్భంగా హాజరైన ప్రజా ప్ర తినిధులు, జిల్లా న్యాయమూర్తు లు, అధికార అనధికారులకు ప్రత్యే క ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగం యావత్తు ఆయన మాటల్లోనే….
ఈ నేలపై ప్రజాస్వామ్యం పరిఢ వి ల్లాలని తెలంగాణ సాయుధ రైతాం గ పోరాటంలో అమరులైన త్యాగధ నులకు, స్వాతంత్య్ర సమరయో ధులకు, తెలంగాణ అమరవీరులకు శిరస్సు వంచి జోహార్లు అర్పిస్తున్నా ను. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్ర బోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జ వహర్ లాల్ నెహ్రుల నాయకత్వం లో జరిగిన సుదీర్ఘ స్వంతంత్ర్య పో రాటంతో 1947 ఆగస్టు 15న భార త దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్ప టికి.. బ్రిటన్ పార్లమెంటు ఆమోదిం చిన ఇండిపెండెన్స్ యాక్టు కారణం గా హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్యానికై ఇంకా పో రాడాల్సి వచ్చింది.
ఒకవైపు దేశమంతా స్వేచ్ఛావా యులు పీలుస్తుంటే తెలంగాణ సమాజం నిజాం నిరంకుశ పాలన లో భూస్వామ్య, జాగీర్దారీ, వెట్టిచా కిరి, బలవంతపు పన్నుల వసూళ్లు, రజాకార్ల ఆగడాలతో తెలంగాణ ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చీమలు ఏకమై పామును చంపిన ట్టు ఒక్కొక్కరు ఏకమై ఉద్యమాన్ని రగిలించారు. రైతులు, మహిళలు, సకల జనులంతా ఏకమై ఆయుధా లు ధరించి, హైదరాబాదు సంస్థా నాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని సాయుధ పోరాటం ఉధృతం చేశారు. దీంతో.. జోగిపేట లో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్ష తన జరిగిన ఆంధ్రజనకేంద్ర సభ ఆంధ్రమహా సభగా ప్రకటించుకోవ డంతో ఉద్యమం తీవ్రమయ్యింది.
అనంతరం, ఆంధ్ర మహాసభల ద్వా రా మగ్దూం మోహియోద్దీన్, రాజ్ బహదూర్ గౌర్, రామానందతీర్థ, శ్రీ మాడపాటి హనుమంత రావు, బూ ర్గుల రామకృష్ణా రావు, కొండా వెం కట రంగారెడ్డి, శ్రీ రావి నారాయణ రెడ్డి వంటి మరెందరో మహానుభా వులు తెలంగాణ ప్రజలను చైతన్య పరిచారు.పోరాటాలకు, త్యాగాలకు ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకం నల్లగొండ జిల్లా తెలంగాణ సాయు ధ పోరాటంలోనూ నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. నల్గొండ జిల్లాలో ప్రతీ ఊర్లో త్యాగాల చరిత్ర ఉన్నది. ఆనాటి నుంచి నేటి దాక న ల్లగొండది నిత్య పోరాటాలు, నిలు వెల్ల గాయాలు, ఆత్మర్పణలు, అలు పెరగని పోరాటాలే.
ఉద్యమ తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య నుంచి మొదలుకుం టే.. శ్రీ భీంరెడ్డి నర్సింహా రెడ్డి, శ్రీ బొ మ్మగాని ధర్మభిక్షం, శ్రీ ఆరుట్ల రామ చంద్రారెడ్డి, శ్రీమతి చాకలి ఐలమ్మ, శ్రీ బద్దం ఎల్లారెడ్డి, శ్రీ జిట్టా రామచం ద్రారెడ్డి, శ్రీ కట్కూరి రామచంద్రారెడ్డి, శ్రీమతి మల్లు స్వరాజ్యం, శ్రీమతి ఆరుట్ల కమలా దేవి, శ్రీమతి సుశీల దేవి, శ్రీ సుద్దాల హనుమంతు, శ్రీ బొందుగుల నారాయణ రెడ్డి వంటి ఎందరో త్యాగధనులు ఈ నేల స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలకులకు ఎదురొడ్డి నిలిచి చరిత్ర పుటాల్లో నిలిచిపోయారు..
బండి యాదగిరి రాసిన “బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతావు కొడుకో.. నైజాం సర్కారోడో…” పాట తెలంగాణా సాయుధ పోరాటాన్ని మరో మెట్టు ఎక్కించింది.
అంతేకాదు, సుద్దాల హనుమంతు.. వెట్టిచాకిరిని వ్యతిరేకిస్తూ వ్రాసిన “పాలబుగ్గల జీతగాడా…” అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వం పై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది.
భూస్వామ్య జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట, శాలిగౌరారం, ఏనెమీదిగూడెం ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయి.
నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటుకు Jangaon జిల్లా భైరాన్పల్లి ఒక చారిత్రక ప్రతీక. గ్రామస్తులు స్వచ్ఛందంగా ఏకమై, తమ గ్రామ రక్షణ కోసం దుర్గం నిర్మించుకున్నారు. అయితే, వందలాదిగా వచ్చిన రజాకార్లు భైరాన్పల్లిపై దాడి చేసి, 340 మంది ప్రజలను దారుణంగా చంపేశారు.
గుండ్రాంపల్లిలో 26 మంది సాయుధ పోరాటవీరులను రజాకార్ల గూండాలు చంపి బావిలో పాతిపెట్టిన దురదృష్టకర సంఘటనను చరిత్ర తన గర్భంలో దాచుకున్నది.
శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 1948లో జాతీయ జెండా ఎగురవేసినందుకు నిజాం సర్కారు సైనికులు కాల్పులు జరిపి 10 మంది ప్రాణాలు బలిగొన్నారు.
హైదారాబాద్ రాష్ట్రంలో ప్రజలపై రజాకార్లు, జమీందార్ల దాడులు పెరుగుతున్నాయని గ్రహించిన భారత ప్రభుత్వం సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో.. 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో ని చేపట్టింది. దీంతో చేసేదేమిలేక నిజాం రాజు 17 సెప్టెంబర్, 1948 సాయంత్రం డెక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు. దీంతో తెలంగాణ స్వాతంత్ర భారతంలో భాగం అయ్యింది.
అనంతరం 1952లో జరిగిన సార్వ త్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి శ్రీ బూర్గుల రామకృష్ణారావు ముఖ్య మంత్రిగానూ కొండా వెంకట రంగా రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకు న్నారు.అయితే, అదే సమయంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ పేరుతో తెలుగు రాష్ట్రా లను కల పాలనే రాజకీయ ప్రతిపాదన ఒకటి ప్రారంభమైంది.ఈ డిమాండ్ పై కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని “కేంద్ర ప్రజా ప్రభుత్వం” మొదట దీనిని అంగీకరించలేదు. తరువాత ఇక్కడ జరిగిన భాషోద్యమాలు, రాజకీయ ఉద్యమాలు, ప్రజా ఆకాంక్షమేరకు ఆంధ్రరాష్ట్రం, హైదరాబాదు రా ష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసింది.
అయితే, ఉమ్మడి రాష్ట్రంలో “పెద్దమనుషుల ఒప్పందం” లోని రక్షణలు అమలు జరగకపోవడం.. విద్యా, ఉద్యోగ, ఉపాధిలో తెలంగా ణ ప్రజలకు అన్యాయం జరుగుతు న్నందున 1969 లో ప్రత్యేక తెలం గాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఈ ఉద్యమంలో దాదాపు 300 మందికి పైగా తెలం గాణ బిడ్డలు అమరులయ్యారు.తొలిదశ ఉద్య మములో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రొ. జయశంకర్, జలగం వెంగళ రావు, టి.ఎన్. సదా లక్ష్మి, మదన్ మోహన్, మర్రి చెన్నా రెడ్డి మొదలైన ఉద్యమకారులతో కలిసి తొలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఇది ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ వంటి హామీలతో శాంతించింది.
అయితే, అందరికీ సమానంగా అవ కాశాలను అందించాలనే దృఢనిశ్చ యంతో ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ తెలంగాణ ప్రజల ప్ర త్యేక రాష్ట్ర కాంక్షను తీర్చలేదు, అ న్యాయాలను ఆపలేకపోవడం తో.. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రా రంభం అయ్యింది..తెలంగాణ జా యింట్ యాక్షన్ కమిటీ (జె.ఏ.సి.) నాయకత్వంలో తెలంగాణ విద్యా ర్థులు, ఉద్యోగ సంఘాలు, తీవ్ర ఉద్యమం చేశారు.తెలంగాణ ఉద్య మంలో మన ఉ మ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంతా చారితో పాటు ఎందరో నవయువ కులు ప్రాణాలు ఆత్మబలిదానాలు చేశారు. నవయవ కుల త్యాగాలకు చెలించిపోయి.. ఆనాటి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినేట్ లో మంత్రిగా ఉన్న నేను మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి మీ మదిలో ఉన్నదే.
అంతేకాదు.. ప్రజా క్షేత్రంలో దిగి 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం మీ కళ్లముం దు ఉన్నదే. ఒకవైపు ప్రజలు, కార్మి కులు, కర్షకులు, పార్లమెంట్ లో తె లంగాణ ఎంపీలు ఉధృతంగా పోరా టం చేస్తుంటే.. మరో వైపు మన ఉ ద్యోగులు తమ ఉద్యోగాలను ఫణం గా పెట్టి 42 రోజుల పాటు సకలజ నుల సమ్మె చేశారు. ఈ సందర్భం గా ఉద్యోగులందరికి నా నమస్సు లు.దీంతో శ్రీమతి సోనియాగాంధీ తెలంగాణ బిడ్డల త్యాగాలను, పో రాటాలను చూసి చలించిపోయి 2014 జూన్, 2 వ తేదీన “తెలం గా ణ ప్రత్యేక రాష్ట్రం” ఏర్పాటు చేయ డం జరిగింది.
ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదే. అమరులత్యాగం వెల కట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో అ మరులైన తెలంగాణ బిడ్డలందరికి నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయ కత్వంలోని మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల పట్ల మిక్కి లి గౌరవాన్ని ప్రకటిస్తున్నది.ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోఠి మహిళా విశ్వ విద్యాలయానికి “చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం” గా నామకరణం చేశాం .
అలాగే హ్యాండ్ లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. అంతేకాదు, మన ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది.
ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో కొత్త ఉద్యోగకల్పన కో సం జాబ్ క్యాలెండర్ ను ప్రకటిం చడం జరిగింది.రాష్ట్ర మహిళలలం దరికీ మహాలక్ష్మి పథకం కింద ఉచి త ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిం చాం.
ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుం చి 10 లక్షల రూపాయలకు పెం చాం.మహాలక్ష్మి పథకం కింద నిరు పేదలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాము.
పేదవారి ఆత్మగౌరవ ప్రతీకలైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారం భించుకుని గృహ ప్రవేశాలు కూడా చేసుకుంటున్నాం.నిరుపేదలకు గృ హజ్యోతి పథకం క్రింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యా న్ని కల్పిస్తున్నాం.చరిత్ర కనీవిని ఎరుగని రీతిలో ఏక కాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం.
ఇందులో మన నల్గొండ జిల్లాలో 2 లక్షల 33 వేల 981 మంది రైతుల కు 2044.83 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రుణ mమాఫీలో నా నల్గొండ జిల్లాకు అత్యధిక లబ్ధిజరగడం నాకు ఎంతో సంతోషం కలిగి స్తున్నది.రాబోయే రోజుల్లో మరింత కష్టపడి నల్గొండ జిల్లా రైతులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.ఇవేకాదు,ప్రజా గాయకుడు గద్దర్ గారి పేరిట సినీ అవార్డులు ఏర్పాటు అవార్డులు ఇచ్చాం.
అందెశ్రీ రాసిన “జయ జయ హే తెలంగాణ” ను రాష్ట్ర గీతంగా ప్రక టించుకున్నాం. తెలంగాణ తల్లి రూపానికి రాజ ముద్ర వేసుకున్నాం.
రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్ట రేట్ల దాకా తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు చేస్తున్నాం.బహుజన ప్ర జా రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వా యి పాపన్న గౌడ్ జయంతిని అధి కారికంగా నిర్వహించుకున్నాం.
మహిళలకే పూర్తి అధికారం ఇస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేశాం. మహిళలను కోటీ శ్వరులను చేయడమే మన ప్రజా ప్రభుత్వ లక్ష్యము అందులో భా గంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా SLBC నల్లగొండ నందు 1.2 ఎకరాల్లో రూ. 5 కోట్లతో మహి ళా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తారు.
ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొ ప్పున అంతర్జాతీయ ప్రమాణాల తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు భూమిని కేటాయించడం జరిగినది. నల్లగొండ లో పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలియజేయ డానికి సంతోషిస్తున్నాను. మిగిలిన (5) నియోజకవర్గాలలో నిర్మాణ పనులు టెండర్ దశలో ఉన్నాయి. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించి నిరుపేదలకు మెరుగైన విద్యను అందిస్తాం.
2004 సంవత్సరంలో 1900 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి ము ఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ని ఒప్పించి SLBC కి శంకుస్థాపన చే యించాను.
2004 నుండి 2014 వరకు 70 శాతం పనులు పూర్తయితే 2014 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా పక్కనపెట్టింది. ఇలా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న SLBC టన్నెల్ నిర్మాణ పను లు మన ప్రజా ప్రభుత్వం ఏర్పాడ్డాక మళ్ళీ ప్రారంభించుకోవడం జరిగి నది. ఇటీవల దూరదృష్టావశాత్తు జరిగిన ప్రమాదం వల్ల పనులు మ ళ్లీ ఆగిపోవడం జరిగింది. ఆగిన లైనింగ్ పనులు తిరిగి ప్రారంభించి 2027 డిసెంబర్ వరకు పూర్తి చేస్తా మని హామీ ఇస్తున్నాను.
అంతేకాదు, బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు Pump House మరియు రిజర్వాయర్ పనులు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో పూర్తి చేసి ముఖ్యమంత్రి ఎ. రేవం త్ రెడ్డి చేతుల మీదుగా, ప్రారంభిం చుకున్నాం.AMRP కాలువలో లై నింగ్ లేకపోవడం వల్ల నీరు నిలు వకపోగా, చివర చివరి అయక ట్టు కు సకాలంలో నీరందడం కష్టమ వుతోంది. ఈ సమస్యను పరిష్కరిం చేందుకు, AMRఎస్ఎల్బిసి కా లువకు 110 కిలోమీటర్ల పొడవున లైనింగ్ పనులు చేయడానికి రూ.4 42 కోట్ల నిధులతో, ప్రభుత్వ ఉత్త ర్వు నెం.80, తేదీ 30.04.2025 ప్రకారం మంజూరు చేసుకున్నాం, టెండర్లు కూడా పిలిచాము త్వరలో పనులు ప్రారంభిస్తాము.
ఈ ప్రాజెక్టు ద్వారా 4 నియోజక వర్గాలకు, 7 మండలాలకు, 94 గ్రామాలకు సాగు నీరు మరియు 107 గ్రామాలకు త్రాగునీరు అందు తుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు క్రింద 10 వేల 100 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి తీసుకురావ డమే కాకుండా 17 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులలో నీరు నింపడం జరి గిం ది.మన ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన మూసీ శుద్దీకరణ త్వరగా పూర్తి చేసుకొని గోదావరి జలాలను మూసి ద్వారా మన జిల్లాకు తీసుకువచ్చి సాగునీరు మరియు తాగు నీరు అందించ డానికి ధృడసంకల్పంతో ఉన్నాం.
ఇకపోతే, 5 ఎకరాలలో 20 కోట్ల రూపాయలతో SLBC నల్లగొండ నందు నర్సింగ్ కళాశాలను మరి యు నల్లగొండ పట్టణంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను నిర్మిం చుకుంటున్నాం.
జిల్లాకు విశ్వ విద్యాలయం ఉండా లని నేను ఎంతో పట్టుబట్టి సాదించి న మహాత్మగాంధీ యునివర్సిటిలో నాగడ్డ మట్టి బిడ్డలు ఇవాళ గోల్డ్ మెడల్స్,డిగ్రీ పట్టాలు అందుకుం టుంటే ఎంతో గర్వకారణంగా అని పిస్తుంది. మరింత మెరుగ్గా తీర్చిది ద్దేందుకు మహాత్మాగాంధీ విశ్వ వి ద్యాలయం అన్నేపర్తి వద్ద 5 కోట్ల రూపాయలతో న్యాయవిద్యా కళా శాల మరియు 6 కోట్ల రూపాయల తో బి. ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేసి 2026-2027 నుండి కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చేలా కృషి చేశాను. అదే విధంగా రెండు అకడమిక్ బిల్డింగ్స్ కోసం 60 కోట్ల తో నిర్మించేందుకు ఆర్ అండ్ బి శాఖ తరుపున టెండర్లు పిలిచాం.
మన పట్టణంలో భారీ లారీలు తిర గడం వల్ల ప్రమాదాలు జరిగి, ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాం. దీనికి పరి ష్కారంగా, రూ.596 కోట్ల వ్యయం తో నల్గొండ Bypass రోడ్ను నిర్మిం చేందుకు పనులు ప్రారంభించాం. రై తులకు మెరుగైన భూపరిహారం అందిస్తూ ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నాం. 6000 మంది వి ద్యార్థులతో ఉన్న సెయింట్ అల్ఫో న్స్ పాఠశాలల్లో, విద్యార్థుల భద్రత కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఇటివలే ప్రారంభించుకు న్నాం.అలాగే, ఎల్బీ నగర్ నుండి హయత్నగర్ వరకు 5.5 కిలోమీ టర్ల పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓ వర్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నాం. ఇందులో ఒకటి రహదారి, మరొకటి మెట్రో రైలు వెళ్ళే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం.
అంతేకాదు, రాష్ట్ర భవిష్యత్తుకు సూపర్ గేమ్ ఛేంజర్ అయిన RRR (రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నా యి.ఇటివల నేను ఢిల్లీ వెళ్లి పలు రోడ్లు, బ్రిడ్జిలు కావాలని రాష్ట్ర ప్ర భుత్వం తరుపున కేంద్రమంత్రి ని తిన్ గడ్కరికి వినతులు ఇచ్చాను.
రెండు రోజుల క్రితమే రాష్ట్ర రహదా రులు, పలు కారిడార్ల నిర్మాణం కో సం కేంద్రం CRIF కింద 868 కోట్లు మంజూరు చేయడం పట్ల రోడ్లు భవనాల శాఖ మంత్రిగా సంతోషి స్తున్నాను. అంతేకాదు, హైదరా బా ద్-విజయవాడ జాతీయ రహదా రి ని 8 లేన్ల నిర్మాణం, వరంగల్ మా మునూర్ ఎయిర్ పోర్టుకు అనుమ తులు రావడం నాకు మిక్కిలి సం తోషం కలిగించింది.తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న వివిధ సంక్షే మ ఫలాలు అర్హులైన వారందరికి అందేలా నల్లగొండ జిల్లా సర్వతో ము మఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్, జిల్లా అధికార యంత్రాంగం, పాత్రి కేయ మిత్రులకు పేరు పేరున శుభా భివందనాలు తెలియజేస్తున్నానo టూ ముగించారు.