Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్టి మేటం, నల్లగొండ మున్సిపాలిటీలో తాగునీటి పనులు డిసెంబర్ లోపు పూర్తి చేయాలి
Minister Komatireddy Venkat Reddy :
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన తాగునీటి పనులను ఈ డిసెంబర్ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదే శించారు.మంగళవారం ఆయన న ల్లగొండ మున్సిపల్ సమావేశ మం దిరంలో నల్గొండ మున్సిపల్ పరి ధిలో చేపట్టిన తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, పారిశుధ్యం త దితర అంశాలపై మున్సిపల్, ప్ర జారోగ్య ఇంజనీరింగ్ శాఖ అధి కారులతో సమీక్ష నిర్వహించారు.
పట్టణంలో అమృత్ పథకం కింద సుమారు 56 కోట్ల 75 లక్షల రూ పాయలతో చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు డిసెం బర్ లోగా పూర్తిచేసి ప్రజలకు తా గునీరు అందించాలని ఆదేశించా రు. అలాగే తాగునీటి ట్యాంకులకు సోర్స్ నుండి నీరు అందించేందు కు గాను అవసరమయ్యే అదనపు ని ధులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు వెంటనే చర్యలు తీ సుకోవాలని ఆదేశాలు జారీ చేశా రు.
నల్లగొండ మున్సిపాలిటీలో 109 కో ట్ల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టిన సిసి రోడ్లు, మురికి కాలు వల పనులను 3 నెలల్లో పూర్తి చే యాలని ఆయన ఇంజనీరింగ్ అధి కారులతో చెప్పారు. ఒకవేళ నిధు లు సరిపోనట్లయితే తన దృష్టికి తీ సుకురావాలని, అవసరమైతే రాత్రి, పగలు పనులు నిర్వహించి రోడ్ల ని ర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఇ కపై ఈ పనులపై ప్రతి మంగళవా రం తాను సమీక్షిస్తానని మంత్రి తె లిపారు. చందనపల్లి బయోమైనింగ్ డంపింగ్ యార్డ్ ను త్వరితగతిన శు భ్రం చేయించాలని ఆదేశించారు.
నల్లగొండ మున్సిపలిటీలోని అన్ని గృహాల నుండి తడి చెత్త, పొడి చె త్తను వేరువేరుగా సేకరించాలని, దీ నికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల ని, ప్రతి ఇంట్లో యజమానితో పా టు, కిరాయిదారుకు వేరువేరుగా త డి చెత్త, పొడి చెత్త బుట్టలను సర ఫరా చేయాలని, ఇందుకుగాను ఎ క్కువ చెత్తబుట్టలను కొనుగోలు చే యాలని మంత్రి ఆదేశించారు. వా ర్డుల వారిగా వార్డు అధికారులు ఇం టి నెంబర్ రాసి చెత్తబుట్టలను స ర ఫరా చేయాలని చెప్పారు. అంతకు ముందు మంత్రి మున్సిపాలిటీలో ఆయా విభాగాలను తనిఖీ చేశారు.
స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిప ల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అ హ్మద్, పబ్లిక్ హెల్త్ సూపరింటిం డెం ట్ వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజ నీర్ రాములు, డిఇ లు కార్తీక్, అశో క్ ,శ్రీధర్ రెడ్డి, ఏఈలు దిలీప్, ప్రవీ ణ్, అసింబాబా, ఏసీపీ కృష్ణవేణి, తదితరులు ఈ సమావేశానికి హా జరయ్యారు.