–యువనాయకునికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మంచి నిర్ణయం
–మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి
Minister Komatireddy Venkata Reddy : ప్రజాదీవెన , నల్గొండ : కమ్యూనిస్టులు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పోరాడతారని అలాంటి వారితో కలిసి పని చేయడానికి తన సిద్ధంగా ఉన్నానని తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం గురువారం నల్లగొండ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి తో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సత్యం ను శాలువాతో సన్మానం చేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటలో సిపిఐ నుంచి ఎమ్మెల్సీగా 20 ఏళ్లు నిరంతరం ప్రజల కోసం పనిచేసిన యువ నాయకుడు సత్యం ను ఎన్నుకోవడం మంచి నిర్ణయం అన్నారు.
నల్లగొండ జిల్లాలో సిపిఐ నాయకులతో మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. జిల్లలో ఏ సమస్యలు ఉన్న వాటి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని కోరారు. మంత్రిని కలసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు ఉజ్జని రత్నాకర్ రావు, మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంకి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామిలు ఉన్నారు.