Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 November 2025, 11:35 am Posted by : praja deveena

Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కితా బు, రాష్ట్రంలోని ప్రసవాల్లో నల్లగొం డ జిల్లాప్రభుత్వాసుపత్రి ముందంజ

Minister Komatireddy Venkata Reddy :

ప్రజా దీవెన, నల్లగొండ: ప్రసవాల ని ర్వహణలో నల్గొండ జిల్లాప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రాష్ట్రంలోనే ముం దుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవా రం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వై కల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రా న్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్ర తినిధులతో మాట్లాడుతూ రాష్ట్రం లో ఉస్మానియా, గాంధీ తర్వాత ఎ క్కువగా ప్రసవాలు నిర్వహించే అ తిపెద్ద ఆస్పత్రిగా నల్గొండ జిజిహెచ్ పేరుపొందిందని, ప్రతినెల 700 నుండి 800 వరకు ప్రసవాలు చేయ డం జరుగుతున్నదని ఆయన తెలి పారు.

గతంలో ఉన్న సదరం శిబిరం కేం ద్రంలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదని, సౌకర్యాల లేమితో వైకల్యం కలిగిన వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడాన్ని దృష్టిలో ఉంచు కొ ని 30 లక్షల రూపాయల వ్యయం తో నూతన భవనాన్ని నిర్మించి విక లాంగులకు కొత్త భవనంలో తాగు నీరు, టాయిలెట్స్, ర్యాంపు,ఇతర అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

వైకల్యం కలిగిన వారు ఇక ప్రతివా రం ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టి ఫికెట్లు పొందవచ్చని అన్నారు. ఇ ప్పటివరకు దృవపత్రాలు రాని వా రికి ధ్రువపత్రాలు జారీ చేయడం జ రుగుతుందని, సదరం ధ్రువ ప త్రా ల ఆధారంగా పెన్షన్ రాని వారికి పె న్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో ఉన్న సౌకర్యాలు ఏ ఇతర ఆ స్పత్రిలో లేవని , ఆసుపత్రిలో అన్ని అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇటీవలే బేబీ వార్మ్స్, లాప్రోస్కోపిక్ మిషన్ వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు, మూడు లక్షల రూపాయల విలువ చేసే ఆపరేషన్లు సైతం ఉచితంగా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చేస్తున్నామని,ఇవి సద్వి నియోగం చేసుకోవాలని కోరారు.

ఇంకా ఆసుపత్రికి అవసరమైన సౌ కర్యాలను కల్పిస్తామని, అవసరమై తే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహ కా రం అందిస్తామని చెప్పారు. ప్రసవా ల కోసం ప్రజలు ప్రైవేట్ ఆ స్పత్రుల కు వెళ్లకుండా ప్రభుత్వ ప్రధాన ఆ స్పత్రికి రావాలని, ఇందుకు ఆశ, అంగన్వాడీ, ఆస్పత్రికి సిబ్బంది, అంబులెన్స్ వాహనాల డ్రైవర్లు, డా క్టర్లు కృషి చేయాలని మంత్రి అ న్నారు.

వైద్య సేవలలో నల్గొండ ప్ర భుత్వ ప్రధాన ఆసుపత్రిని రాష్ట్రం లోనే నంబర్ వన్ గా నిలపాలన్నదే త మ లక్ష్యమని అన్నారు. జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, ఆర్ డి ఓ వై.అశో క్ రెడ్డి,జిల్లా ఆస్పత్రి సూపరింటిం డెంట్ అరుణ కుమారి, ఆర్ఎంవో, ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.