Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక కామెంట్, పేదోళ్లకు ఆధునిక వైద్యం కోసమే జిల్లాకేంద్ర ప్రభుత్వాస్పత్రి లో లాప్రోస్కోపిక్ యూనిట్
Minister Komatireddy Venkata Reddy :
ప్రజా దీవెన నల్లగొండ: ధనవంతుల మాదిరిగానే పేదవారికి అధునాత న వైద్య సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి తెలిపారు ప్రతీక్ ఫౌండేషన్ ఆ ధ్వర్యంలో సోమవారం నల్గొండ జి ల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సు మారు కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ను పద్మ విభూషణ్ డాక్ట ర్ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించగా, రా ష్ట్ర మంత్రి ముఖ్యఅతిథిగా హాజర య్యారు.ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ ప్రపంచంలోనే గర్వించదగ్గ పద్మ విభూషణ్, గ్యా స్ట్రోఎంట రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ ప్రధా న ఆసుపత్రిలో అదనాతన వైద్య స దుపాయాలు కలిగిన లాప్రోస్కోపిక్ యూ నిట్ ప్రారంభించడం సంతోష కరమన్నారు.
నల్గొండ జిల్లాలో పేద ప్రజలకు మం చి వైద్యం అందించేందుకుగాను గ తం నుండి తాను కృషి చేస్తున్నాన ని, సంవత్సరంలోపే ప్రభుత్వ వై ద్య కళాశాలను నిర్మించామని, 40 కోట్లతో నర్సింగ్ కళాశాలను సైతం కట్టిస్తున్నామని, ప్రభుత్వ ప్రధాన ఆ స్పత్రిని అంచలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల చిన్న చిన్న ఆపరేషన్లను ఇక్కడే ని ర్వహించే విధంగా, పేదవారికి మే లు చేసేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిం దని అన్నారు.
విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చే సుకొని ఆ లక్ష్య సాధన కోసం కృషి చే యాలని, పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి లాంటి వారిని ఆద ర్శంగా తీసుకోవాలని ఆయన తెలి పారు.ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడిక ల్ విద్య పూర్తి చేసిన విద్యా ర్థులకు ఏఐజి ఆసుపత్రిలో ఇంట ర్న్షిప్ శిక్ష ణ చేసేందుకు అవకాశం కల్పించా లని ఆయన డాక్టర్ నాగే శ్వర్ రెడ్డిని కోరారు. ప్రభుత్వ ఆసు పత్రి నుండి జిజిహెచ్ కు వెళ్లేందుకు గాను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బ స్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తె లిపారు.
పద్మ విభూషణ్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆ సుపత్రిలో అత్యాధునిక, ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన లా ప్రో
స్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేయ డం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డిని అభినందించారు. దీని ద్వా రా పేద ప్రజలు వివిధ రకాల శస్త్ర చి కిత్సల కు హైదరాబాదుకు వెళ్ళా ల్సిన అవసరం లేదన్నారు.
తన తండ్రి ఆశయం మేరకు పేద ప్ర జలకు సేవలు అందించడమే కాకుం డా, వైద్య విద్యార్థులకు శిక్షణ, పరి శోధన వంటి వాటిలో తాను కృషి చే స్తున్నానని, అందులో భాగంగానే ఏ ఐజి ఆసుపత్రిని స్థాపించడం జరి గిందని తెలిపారు. జీవితంలో అం దరికీ అవకాశాలు వస్తాయని, వా టిని అందిపుచ్చుకున్న వారే ముం దుకు వెళ్తారని తెలి తెలిపారు. ఏ ఐజి అనేది ఆస్పత్రి మాత్రమే కా ద ని, ఇది పరిశోధనా కేంద్రమని, ఇ క్కడ ఇంటర్న్షిప్ తో పాటు, వివిధ రకాల పరిశోధనలు చేసే విద్యార్థు లు సైతం ఉన్నారని చెప్పారు.
కాబోయే డాక్టర్లు ఎంబీబీఎస్ పూర్తి అయిన తర్వాత ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసం కృషి చేయాలని చెప్పారు. ముఖ్యంగా వై ద్యులు 3 H లు, 3 క్ లు కలిగి ఉం డాలని Honesty,Humility, Hard work, అలాగేCompassiin, Co mmunication, Commitment లు కలిగి ఉండాలని తెలిపారు. న ల్గొండ ప్రభుత్వ వైద్యశాల కళాశాల విద్యార్థులు ఏ ఐ జి ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేసేందుకు నల్గొండ ప్ర భుత్వ వైద్య కళాశాలను దత్తత తీ సుకుంటున్నట్లు ఆయన ప్రకటించా రు.
మరో గ్యాస్ ఎంట్రాలజిస్టు డాక్టర్ జి వి రావు మాట్లాడుతూ నల్గొండ ప్ర భుత్వ వైద్యు కళాశాల చాలా బా గుందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య ప రికరాలు ఏర్పాటు చేయడం సంతో షమని అన్నారు.దీనివల్ల ఎన్నో సర్జ రీలు పెరిగే అవకాశం ఉందని, అం తేకాక నల్గొండ చుట్టుపక్కల ప్రాం తాల పేద ప్రజలకు ఎంతగానో ఉ పయోగపడుతుందన్నారు.ప్రముఖ సామాజిక కార్యకర్త, చారిటీ నిర్వా హకులు ఎస్పి రెడ్డి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అద న పు కలెక్టర్ జే శ్రీనివాస్, ప్రభుత్వ ప్ర ధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అ రుణకుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మా తృనాయక్, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయ ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్య క్షులు హఫీజ్ ఖాన్, ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సి పల్ రాధాకృష్ణ, డిప్యూటీ డిఎం హెచ్వోలు, డాక్టర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.