Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చేవరకు ఏ పద వీ చేపట్టనన్న మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ

Minister Komatireddy Venkata Reddy :

ప్రజా దీవెన, నల్లగొండ: చరిత్రలో చె ప్పిన మాట ప్రకారం ఆచరించి చూ పిన మహానేత కొండా లక్ష్మణ్ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కితాబుని చ్చారు. కొండా లక్ష్మణ్ బాబూజీ సేవలు అజరామరం అని, వారి మా టలు,చేతలు నేటి తరం నేతలకు ఎంతో స్పూర్తి దాయకయమని పే ర్కొన్నారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి శనివా రం పూలమాల వేసిన ఆయన ఘ నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

కొండా లక్ష్మణ్ బాబూజీ స్ఫూర్తితోనే తెలంగాణ కోసం నేను మంత్రి పద వికి రాజీనామా చేసిఆమరణ దీక్ష చేశానని గుర్తు చేశారు. వారి ఆశ యాలకు అనుగుణంగా ప్రజా ప్రభు త్వం పనిచేస్తున్నదని వివరించారు.

పేదవారి ప్రగతి కోసం ప్రభుత్వం అ న్ని విధాల కృషి చేస్తున్నదని, మా కృతనిశ్చయ ప్రయత్నమే ఆమహ నీయుని జయంతి సందర్భంగా ఘ న నివాళులు అర్పిస్తున్నానన్నారు.

మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి ప్రజలకు ఏమి కావాలో తెలుసుకున్నారని,

జనాభాలో ఎవరెంతో వారికంతా అ నే నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నా రని తెలిపారు. రాహుల్ గాంధీ ఇ చ్చిన మాట మేరకు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం బీసీలకు 42% శా తం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నం బర్ 9 విడుదల చేశామన్నారు.

ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నా సహచర మంత్రుల కు హృదయ పూర్వక ధన్యవాదా లని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీసీ బిడ్డలకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలని అన్నారు.

దళితున్ని సిఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని ఆరోపిస్తూ మేము మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామని చెప్పి ఇచ్చామని గుర్తు చేశారు. రిజర్వేషన్లు కల్పించి బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.

ఈ శుభ సమయంలో కొందరు కో ర్టుకు వెళ్తున్నట్లు మా దృష్టికి వచ్చిం దని, దయచేసి బీసీలకు జరుగుతు న్న మంచిని అడ్డుకోవద్దని కోరారు.

కోర్టులో కేసులు వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్న ఇది కాంగ్రెస్ పార్టీకి కాదు, తెలంగాణ ప్రజలకు మేలు చేసే నిర్ణ యమని స్పష్టం చేశారు.

దేశానికి దిక్సూచిగా నిలిచే సాహ సోపేత నిర్ణయానికి పార్టీలకు, రాజ కీయాలకు అతీతంగా రిజర్వేషన్ల జీ వోకు మద్దతు ఇవ్వాలని కోరుతు న్నామన్నారు.