Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, నల్లగొండను నందనవనం గా నవీకరిస్తాం

–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

–8 కోట్ల తో పాదాచారుల వంతెన పనులకు శంకుస్థాపన

Minister Komatireddy Venkata Reddy :

ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పట్టణంలో రద్దీగా ఉండే రోడ్లపై పాదాచారుల వంతెన ఏర్పాటు చేయడం అందరికీ ఎంతో మేలు చేస్తుందని అన్నారు.

శుక్రవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాల వద్ద 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పాదాచారుల వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెంట్ ఆల్ఫాన్సెస్ పాఠశాల వద్ద ప్రతిరోజు విద్యార్థులతో రద్దీగా ఉంటుందని, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకుగాను పాదాచారుల వంతెనను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రహదారులతో పాటు, మురికి కాలువలు, సిసి రోడ్లు వంటివి నిర్మిస్తున్నామని, పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాదాచారుల వంతెన వల్ల ట్రాఫిక్ ఇబ్బందు లేకుండా ఉండడమే కాకుండా, ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో రహదారుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వివరించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ పాఠశాల ప్రారంభ, ముగింపు సమయంలో ఎక్కువ సందడి నెలకొంటుందని, అప్పుడు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని, పాదాచారుల వంతెన నిర్మించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. అయితే విద్యార్థులు పోటీపడి రోడ్డును దాటేందుకు ప్రయత్నించవద్దని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు రోడ్డు భద్రతపై తెలియజేయాలని కోరారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రతినిత్యం 1000 నుండి 2000 మంది పిల్లలు ఈ పాఠశాల వద్ద రోడ్డు దాటడం వంటివి చేస్తున్నారని, ఇది ఎంతో ప్రమాదకరమని గుర్తించి పాదాచారుల వంతెన మంజూరు చేయడం సంతోషమని అన్నారు. పాదాచారుల వంతెన విద్యార్థులకే కాకుండా, రోడ్డును దాటి వెళ్లే వారికి, ప్రమాదాలు నివారించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.