Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy : మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగం, న ల్లగొండ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డా, మీరే నా బలం,బలగం

Minister Komatireddy : ప్రజా దీవెన,నల్లగొండ:నల్లగొండ గ డ్డ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డ అని కాంగ్రెస్ కండువా మోసే నిఖార్సై న కార్యకర్తలే పార్టీకి బలమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. “మీరే నా లీడర్లు..మీరే నా క్యా డ ర్..మీరే నా బలం,బలగం” అని, “ఏ సమయంలోనైనా తోడుగా నా వె న్నంటే ఉంటూ 30 ఏళ్లుగా నన్ను అక్కున చేరుకున్నారు. ఏమిచ్చినా మీ ఋణం తీర్చలేనిది.” అంటూ ముఖ్యనాయకుల సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. మం గళవారం నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక MNR గార్డెన్ లో విస్తృత స మావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నియోజకవర్గ అభివృద్ధి, సం క్షేమ పథకాల అమలు, పార్టీ బలో పేతం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ పాద యాత్రలతో, ప్రజా చైతన్యం తో ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ ఇ చ్చిన సోనియా గాంధీ,పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఆలోచ నల మేరకు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేడు ప్రతి వర్గానికీ అండగా నిలుస్తుందని గుర్తు చేస్తూ, భవిష్యత్తు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరడానికి ప్రతి కార్యకర్త కృషి చే యాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధిలో నల్గొండ నియోజకవ ర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలు పుతానని,ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్య త మీదేనని ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవ ర్గంలో గ్రామీణ రోడ్లు అన్ని డబుల్ రోడ్లుగా మారుస్తానని విద్యా,వై ద్యంలో ఇంకా మెరుగైన సదుపా యాల కల్పనకు కృషి చేస్తానన్నా రు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగంగా జరుగుతున్నాయ ని,9నెలల్లో అందుబాటులోకి రా నుందని తెలిపారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో లా ఫార్మసీ కోర్సులు అందుబాటు లోకి తెచ్చామని అన్నారు. SLBC సొరంగం నూతన టెక్నాలజీతో 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. డిండి,బ్రాహ్మణ వెల్లెంల పూర్తి స్థా యిలో అందుబాటులోకి తెస్తా మ న్నారు. కెనాల్ లైనింగ్ పనులు వేగంగా పూర్తి చేస్తామని,చెరువులు నింపి రైతాంగానికి బాసటగా నిలు స్తామని అన్నారు. రోడ్లు, కాలు వ లు,కాలేజీలు, హాస్పిటల్స్, ప్రాజెక్టు లు ఏది చూసినా నల్లగొండ మోడల్ అనేలా చేస్తానని మాటిస్తున్నానని అన్నారు. పేదలు,రైతులు అన్ని వ ర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని గుర్తు చేశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా 100శా తం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెప లాడాలనీ శ్రేణులకు పిలుపునిచ్చా రు. అన్ని స్థానాలు గెలిపించి తనకు గిఫ్ట్ గా ఇవ్వాలని మీ ఏ గిఫ్ట్ కావా లో నాకు వదిలేయండి అని మంత్రి భరోసా కల్పించారు.బిఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు అయిందని,అది మునిగిపోయే నావానేను ఎప్పుడో చెప్పానన్నారు. కవిత బిఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని చెప్తుందని.వారి అవినీతికి అంతే లే దని,కాళేశ్వరం,ధరణి పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టా రు.

నల్గొండ జిల్లాలో ఓ లిల్లీపుట్ ఉ న్నాడనీ ఎప్పుడూ గెలిచిన రెండు వేల లోపు మెజార్టీనే..ఇక మళ్ళీ గెలవడని,విద్యా శాఖ మంత్రిగా ఉండి ఏనాడు MG యూనివర్సి టీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవని తీవ్ర స్థాయిలో మండిపడ్డా రు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రేష న్ కార్డులు, ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం ఇస్తూ పేదల కడుపు నింపుతున్నామని, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల గృహ జ్యోతి ఉచిత విద్యుత్ ఇస్తున్నా మని అన్నారు. లక్షల కోట్లు అప్పు మన మీద పెట్టిన,కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీలు అమలు చే స్తుందని అన్నారు.తెలంగాణ ఇచ్చి న కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కేతా వత్ శంకర్ నాయక్, నల్గొండ ప ట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గు మ్ముల మోహన్ రెడ్డి, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూ ప్ రెడ్డి, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, నల్గొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మ య్య, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మాడుగుల పల్లి మాజీ జెడ్పిటిసి సైదులు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధు లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ కులు పాల్గొన్నారు.