Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddyvenkatreddy : త్వరలోనే రైతులందరికీ రైతు భరోసా

--తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సభలు --డిసెంబర్ 7 సీఎం చేతుల మీదు గా బ్రాహ్మణ వెల్లంల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, మెడికల్ కళాశాల ప్రారం భోత్సవం -- రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

త్వరలోనే రైతులందరికీ రైతు భరోసా

–తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సభలు
–డిసెంబర్ 7 సీఎం చేతుల మీదు గా బ్రాహ్మణ వెల్లంల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, మెడికల్ కళాశాల ప్రారం భోత్సవం
— రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: రైతులందరికీ రైతు భరోసా డబ్బు లను త్వరలోనే వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలం గాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని పేర్కొ న్నారు. డిసెంబర్ 7న బ్రాహ్మ ణ వెల్లంల ప్రాజెక్టు, నల్గొండలోని మెడికల్ కళాశాలకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగు తుందని పేర్కొన్నారు. అనంతరం ఎన్జీ కళాశాలలో బహిరంగసభ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు రిజర్వాయర్ ను ఇప్పటికే నింపడం జరిగిందని తెలిపారు.

ఈ ప్రాజెక్టుతో చుట్టు పక్కల గ్రామాలలో భూగర్భ జలాలు పెరగడం తో పాటు సాగు ఆయకట్టు పెరుగుతుందన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో 18 సంవత్సరాల తన చిరకాల వాంఛ నెరబొరబోతుందని అన్నారు.రైతు రుణమాఫీని కూడా పూర్తిస్థాయిలో రైతులకు చెల్లిస్తా మని స్పష్టం చేశారు.నల్గొండ పట్టణంలో రూ.110 కోట్లతో స్పెషల్ డెవల ప్మెంట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోపాటు పలు అభివృద్ధి పనులు, రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన, రూ.275 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవనాన్ని సీఎం చేతుల మీదు గా శంకుస్థాపన చేయడం జరుగుతుం దని మంత్రి పేర్కొన్నారు.

అదే విధంగా పాత టౌన్ హాల్లో కొత్తగా జిల్లా గ్రంథాలయంకు శంకు స్థాపన చేయడం జరుగుతుందని తెలి పారు. వీటితో పాటు రూ.1 00 కోట్లతో లతీఫ్ షాప్ దర్గా, బ్రహ్మం గారి గుట్ట ఘాట్ రోడ్డుల కు శంకుస్థాపన చేయడానికి ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్టిమేట్ వేయడం జరిగిందని వెల్లడించారు. వీలైతే వీటిని కూడా సీఎంతో శంకు స్థాపన చేయడానికి ప్లాన్ చేస్తు న్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డితో పాటు ఎంపీ,ఎమ్మెల్యేలు పాల్గొం టారని పేర్కొన్నారు .శుక్రవారం సీఎం పర్యటనకు సంబంధించి ఖచ్చితమైన తేదీని ప్రకటించి చెబు తానని పేర్కొన్నారు.

జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటిని కూడా పూర్తి చేస్తామనిస్పష్టం చేశారు. మూసితో ఎక్కువ నష్టపోయేది, అనారోగ్యం పాల య్యేది నల్లగొండ జిల్లా ప్రజలేనని అన్నారు. మూసి ప్రక్షాళనతో న్యాయం జరుగుతుంద న్నారు.ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గానికి సంబంధించి రెండు మిషన్లు త్వరలో జిల్లాకు చేరు కుంటాయని, 20 నెలల్లోనే సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని అన్నా రు. దీంతో ఎంఆర్పితో పని లేకుం డా నీళ్లు వస్తాయని తెలిపారు.

రూ.500 కు గ్యాస్ సిలిండర్ ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే

దేశంలో ఎక్కడలేని విధంగా రూ 500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వానిదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా 200 యూనిట్ల కరెంటును కూడా ఉచి తంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. నెలకు రూ.300 కోట్లను భరిస్తూ మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తు న్నామని అన్నారు.ఇలాం టి సంక్షేమ పథకాలు బిజెపి అధికారాల్లో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడ కూడా అమలు కావడం లేదన్నారు. దీనికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన 11 నెలలు ఎన్నో సంక్షేమ పథ కాలను అమలు చేసిం దని అన్నారు.కెసిఆర్ తెలంగాణను అప్పుల పాలు చేయగా వాటిని భరిస్తూ పలు అభివృద్ధి సంక్షేమ పథకా లను అమలు చేస్తూ ముం దుకు పోతుంటే మోడీ విమర్శించడం శోచనీ యమన్నారు .

రూ. 30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు…రూ .30 వేల కోట్లతో చేపట్టబోయే రీజినల్ రింగ్ రోడ్డు శంకుస్థాపనకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి గట్కర్ని కూడా కలిసి ఆహ్వానించడం జరుగుతుందని తెలి పారు.అభివృద్ధి, నిధుల కోసం కేంద్ర మంత్రులను కలవడం జరుగు తుందని వెల్లడించారు.హైదరాబాద్-విజయవాడ రోడ్డును కేంద్రమం త్రి గట్కరితో చర్చించి ఫైనల్ చేయడం జరుగుతుందన్నారు. నల్గొండ రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి టెండర్లు పిలవడం జరిగిందని ,అవి కూడా త్వరలో పనులు ప్రారంభమవు తాయని పేర్కొన్నారు.

కెసిఆర్ వస్తేనే మాట్లాడుతా…బిఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష నాయకు డు ఎవరో చెప్తే వారు మాట్లాడితే తాను సమాధానం చెప్తానని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.కెసిఆర్ రాష్ట్రా న్ని బంగారు తెలంగాణ చేస్తానని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఫామ్ హౌస్ లో పండుకున్నాడని విమర్శించారు.అల్లుడు హరీష్ రావు, కొడుకు కేటీఆర్ గురుకులాల గురించి మాట్లాడితే తాను సమాధానం చెప్పనని, వాళ్లు నా స్థాయి కాదన్నారు. దమ్ముంటే కేసీఆర్ వచ్చి మాట్లాడాలని అన్నారు.ఈ సమావేశoలో నల్గొండ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్ గౌడ్,నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Minister komatireddyvenkatreddy