Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Lokesh: అడ్డుఅదుపూ లేని అక్రమాలు

–ప్రజాధనం దుర్వినియోగంలో జగన్ ప్రభుత్వం దుర్నీతి
— రూ. 500 కోట్ల వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసుల నిర్మాణం
— నిబంధనలోకి నుంచి 26 జిల్లాల్లో ప్రభుత్వ భూముల కేటాయింపు
–తన ‘ఎక్స్ ‘ ఖాతాలో ఘాటు వ్యా ఖ్యలు చేసిన మంత్రి లోకేష్

Minister Lokesh: ప్రజాదీవెన, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో భూమిని కేటాయించడంపై మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఘాటుగా స్పందించారు. ‘ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా జగన్‌’ అంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కార్యాలయాల (YSRCP Offices) కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు జగన్‌ (jagan) కేటాయించుకున్నారని మండిపడ్డారు. జనం నుంచి దోచుకున్న డబ్బులో 500 కోట్ల రూపాయలతో జి‌ల్లాల్లో జగన్‌ వైఎస్సార్సీపీ కార్యాలయాలు నిర్మించారని మంత్రి లోకేశ్ (Minister Lokesh) విమర్శించారు. జగన్‌ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 500 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చన్నారు. జగన్‌ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చని అన్నారు. జగన్‌ కు ఈ ప్యాలెస్‌ల పిచ్చి ఏంటని విమర్శించారు. ఆయన ధనదాహానికి అంతులేదా అని నిలదీశారు. జగన్‌కు ఈ ప్యాలెస్‌ల పిచ్చి ఏంటని విమర్శించారు. ఆయన ధనదాహానికి అంతు లేదా అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యాలయాల (YSRCP Offices) చిట్టా: అయిదేళ్లుగా రాష్ట్రంలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. దీనిని 33 సంవత్సరాలకు ఎకరా వెయ్యి రూపాయల చొప్పున స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చారు. విజయనగరం జిల్లాలో చెరువు గర్భం స్థలాన్ని డీ-పట్టాగా మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో భారీ భవనం నిర్మిస్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎకరం 18 సెంట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారు. విశాఖ ఎండాడలో రూ.100 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో ( government land)కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. తాజాగా ఈ నిర్మాణానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు నోటీసులు అంటించారు.

అనకాపల్లిలో రూ.15 కోట్ల విలువైన ఎకరం 75 సెంట్ల భూమి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి, ఇక కాకినాడలో 75 కోట్ల విలువైన ఎకరం 93 సెంట్ల సర్కారు భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 60కోట్లకు పైగా విలువైన 2ఎకరాల ప్రభుత్వ స్థలంలో, నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో రూ.10 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం (YSRCP Offices) నిర్మాణం (Construction) చేపడుతున్నారు. ఇలా రాష్ట్రం వ్యాప్తంగా అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు.