Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Nalamadha Uttam Kumar Reddy: రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్

Minister Nalamadha Uttam Kumar Reddy: ప్రజా దీవెన కోదాడ రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశించారుర. శనివారం అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ గ్రామ వద్ద ఉన్న పాలేరు ఏరు వద్ద ఉన్న పాలేరు వాగుపై 52 కోట్ల రూపాయలతో నిధులతోనిర్మించే రాజీవ్ శాంతి నగర్ ఎత్తి పోతల పథకంను మంత్రి పరిశీలించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదగా శాంతి నగర్ లిప్ట్ ని ప్రారంభించటం జరిగిందన్నారు.

లిఫ్ట్ ద్వారా ఐదు వేల ఎకరాలు తీవ్ర కరవు వచ్చిన పాలేరు వాగు నుండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకొని రావటం జరుగుతుందని తెలిపారు. పాలేరు రిజర్వాయర్ కి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు,అలాగే మున్నేరు నీరు ని పాలేరు కి తరలించి సాగు నీరు అందించటం జరుగుతుందని తెలిపారు.ఎత్తి పోతల పథకానికి, చెక్ డ్యామ్ కి రాజకీయాలకి తావు లేకుండా రైతులు సహకరించాలని మనం అందరం కలిసి అద్భుతమైన ఎత్తిపోతల పథకం నిర్మించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజా ప్రతినిధులు అనంతగిరి మండలంలోని వివిధగ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీనాయకులు రైతులు గ్రామల ప్రజలు తదితరులు పాల్గొన్నారు