— ఏపి మంత్రి నారాయణ వెల్లడి
Minister Narayana:ప్రజా దీవెన, అమరావతి: బెజవాడ దుఖ:దాయని అని పేరు గాంచిన బుడమేరకు రిటైనింగ్ వాల్ నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బ్రిటీష్ కాలం నుంచి విజయవాడను ముంచె త్తుతూ ప్రజలకు కష్ణాలను మిగు ల్చుతున్న బుడమేరు సమస్యకు చెక్ పలికేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)ఇప్పటికే అనేక మంది సాగునీటి రంగ నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఒకవైపున వరద సహాయక చర్య ల్లో తలమునకలై ఉన్న సీఎం బు డమేరు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోకున్న చర్యలను ప్రజలకు వివరించే ఆలోచనలో ఉన్నారు. బుడమేరుకు ఎన్నో రెట్లు పెద్ధదైన కృష్ణానది వరద విజయ వాడను ఏమీ చేయలేకపోయింది. కానీ బుడమేరు వాగు మాత్రం నగ రంలో చాలా ప్రాంతాల్ని ముం చెత్తింది. దీంతో ఇప్పుడు ప్రభు త్వం కూడా ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో కృష్ణానది (Krishna River) వరదల నుంచి నగరాన్ని కాపాడిన ఆ ఫార్ములానే ఇక్కడా ఉపయోగిం చాలని నిర్ణయించింది. కృష్ణానదికి ఈ ఏడాది భారీగా వరద పోటె త్తింది. ముఖ్యంగా ఎగువ ప్రాంతా ల్లో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యా రేజ్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో వరద ప్రవహించింది. అయితే ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితుల్లో మునిగే ప్రాంతాలన్నీ ఈసారి మా త్రం సేఫ్ గానే ఉన్నాయి. దీనికి కారణం ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండు భాగాలుగా నిర్మించిన కృష్ణా రిటైనింగ్ వాల్. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ రిటైనింగ్ వాల్ (Retaining wall)ను గత వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇదే కృష్ణానది వరదల నుంచి బెజవాడ స్థానికుల్ని కాపాడింది.
దీంతో బుడమేరుకూ ఇలాంటి వాల్ నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే బుడమేరు కెనాల్ పొడవునా కృష్ణా రిటైనింగ్ వాల్ తరహాలోనే మరో రిటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ మంత్రి నారాయణ (Minister Narayana) ఇవాళ వెల్లడించారు. అయితే ప్రస్తుతం వరద పరిస్ధితుల్లో దీని పనులు మొదలుపెట్టే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతానికి బుడమేరు గట్ల ఎత్తు పెంచుతున్నారు. వరద తగ్గాక బుడమేరు రిటైనింగ్ వాల్ పనులకు అయ్యే బడ్జెట్ అంచనా వేసి నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఆ తర్వాత రిటైనింగ్ వాల్ పనులు ప్రారంభమవుతాయి.