Minister Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన, రాష్ట్రంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం
Minister Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగా ణ రాష్ట్రంలో భూసమస్యలకు శా శ్వత పరిష్కారం లక్ష్యంగా లైసెన్స్ డ్ సర్వేయర్ల నియామకం చేపడు తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌ సింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరె డ్డి ప్రకటించారు. తొలివిడతలో ఐ దువేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల ను తీసుకోబోతున్నామని తెలి పారు.నక్షా లేని గ్రామాలు, లైసెన్స్ డ్ సర్వేయర్ల శిక్షణపై గురువారం మంత్రి అధికారులతో సమీక్షించా రు.
వీరికి ఈనెల 26వ తేదీ నుంచి ఆ యా జిల్లా కేంద్రాల్లోనే శిక్షణా కార్య క్రమాలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. రెండు నెలల పాటు వీరి కి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ద రఖాస్తుదారులు సోమవారం రోజు ఆయా జిల్లా సర్వే అధికారులను సంప్రదించాలని సూచించారు. శిక్ష ణ పూర్తైన వెంటనే ఆయా మండ లాల్లో భూవిస్తీర్ణం, భూలావాదేవీ లను బట్టి ఆరు నుంచి ఎనిమిది మంది సర్వేయర్లను నియమిస్తామ ని తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రతిగ్రామంలో మండలంలో రెవెన్యూ డివిజన్‌లో పట్టణ ప్రాంతాల్లో భూములకు సం బంధించిన అనేక పంచాయితీల ను ఈ సర్వేయర్ల ద్వారా శాశ్వత భూ పరిష్కారం చూపుతామని ఆ శాభావం వ్యక్తం చేశారు.రిజిస్ట్రేషన్ సమయంలో ఎమ్మార్వో, సబ్ రిజి స్ట్రార్ దగ్గర భూములకు సంబం ధించిన డాక్యుమెంట్లతో పాటు స ర్వే పత్రాన్ని కూడా జత పరచాలని భూభారతి చట్టంలో పేర్కొనడం జ రిగింది. ఇందుకు అనుగుణంగానే సర్వే విభాగాన్ని పూర్తి స్ధాయిలో బ లోపేతం చేస్తున్నామని తెలిపారు.
*నెలరోజుల్లో సర్వే ప్రక్రియ సంపూర్ణం….* రాష్ట్రంలో నిజాం కాలం నుంచి సర్వే జరగని, ఇప్పటి వరకు సర్వే రికార్డులు లేని 413 న క్షా గ్రామాలలో రీసర్వే చేపడుతు న్నామని ఇందులో భాగంగా ప్ర యోగాత్మకంగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగ ర్, జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మం డలం కొమ్మనాపల్లి ( కొత్తది) గ్రా మం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మం డలం ములుగుమడ , ములుగు జి ల్లా వెంకటాపురం మండలం నూ గురు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాల ను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఐదు గ్రామాల్లో ముందుగా గ్రామస భలు నిర్వహించి సర్వేకు సంబం ధించిన అంశాలపై ప్రజల్లో అవగా హన కల్పించడం జరిగింది. నెలరో జుల్లో ఈ సర్వే ప్రక్రియ పూర్తిచేయా లని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణ యాలు తీసుకున్నా ఏ సంస్కర ణలు చేపట్టినా ప్రజా కోణంలో ఆ లోచించి ప్రభుత్వ ఆలోచనకు అ నుగుణంగా క్షేత్ర స్ధాయిలో అధికా రులు పనిచేయా లని మంత్రి పొం గులేటి సూచించారు.