Minister Ponguleti Key Announcement : మంత్రి పొంగులేటి కీలక ప్రకటన, ప్రజలకు మరింత చేరువగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
Minister Ponguleti Key Announcement : ప్రజా దీవెన , హైదరాబాద్ : ప్ర జల కు అత్యుత్తమ సేవలు అందిం చా లన్న లక్ష్యంతో సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాలను ప్రజలకు మరింత చేరువచేస్తున్నట్లు రెవెన్యూ, హౌ సింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగు ణంగా అధికారులు పని చేయాలని కోరారు.
రెండవ దశలో భాగంగా రాష్ట్రం లో 25 సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో సోమవారం స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభమైంది. మొదటి దశలో ని 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో, రెండో దశలో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ ఈరోజుతో 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమ లులోకి వచ్చిందని, వచ్చేనెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకిం గ్ విధానం అమలు చేస్తామన్నారు.
రిజిస్ట్రేషన్‌కు వచ్చి గంటల తరబ డి చెట్ల కింద నిరీక్షించి క్యూలైన్లలో నిల్చోనే పరిస్దితికి అడ్డుకట్ట వేసేం దుకు, సమయాన్ని ఆదా చేసేందు కు, పారదర్శకతను తీసుకురావడా నికి ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో క్యూలైన్లకు గుడ్‌బై చెప్పే రోజులు వస్తాయని దళారులు ప్ర మేయం కూడా ఉండబోదన్నారు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా కేవలం 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్ర క్రియ పూర్తి అవుతుండడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నార ని అన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్ registration. telangana. gov.in స్లాట్ బుకింగ్ మా డ్యూల్ ద్వారా ఏరోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చే యించుకునేలా స్లాట్ బుకింగ్ ఉప యోగపడుతుందని అలాగే సేవ ల్లో జాప్యం, సిఫార్సులు, దళారుల జోక్యం లేకుండా ప్రజలు మెరుగైన సేవలు అందుతా యని అన్నారు. ప్రజల సౌకర్యార్ధం అవసరమైన చో ట రిజిస్ట్రార్ల సంఖ్యకూడా పెంచు తున్నామని మంత్రి వివరించారు.