Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dharani Portal : మంత్రి పొంగులేటి సంచలన వ్యా ఖ్య, ధ‌ర‌ణితో రైతులకు ఎన్నో నిద్ర‌ లేని రాత్రులు

Dharani Portal  :ప్రజా దీవెన, హైద‌రాబాద్:ధ‌ర‌ణి పోర్ట‌ల్ వ‌ల్ల రైతులు నిద్ర‌లేని రా త్రులు గ‌డిపార‌ని, గ‌త ప్ర‌భుత్వం చేసిన నిర్వాకం వ‌ల్ల తొంద‌ర‌పాటు వ‌ల్ల వారి ప్ర‌మేయం లేకుండానే రై తులు శిక్ష‌ను అనుభ‌వించార‌ని రా ష్ట్ర రెవెన్యూ హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొం గులేటి శ్రీ‌నివాస‌రెడ్డి సంచలన వ్యా ఖ్యలు చేశారు. శుక్రవారం నిర్మ‌ల్ ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజన సంక్షే మ శాఖ మంత్రి శ్రీ‌మ‌తి సీత‌క్కతో క‌లిసి భూభార‌తి అవ‌గాహ‌న స‌ద‌ స్సుల్లో మంత్రి పాల్గొని ప్రసంగించా రు. భూభార‌తి చ‌ట్టం అమ‌లులో భాగంగా ట్రిబ్యున‌ల్స్ ఏర్పాటు చే స్తామ‌ని ప్ర‌క‌టించారు.

భూభార‌తి నాలుగు పైల‌ట్ మం డ‌లాల్లో 13వేల ద‌ర‌ఖాస్తులు వ‌ చ్చాయ‌ని వీలైనంత‌వ‌ర‌కూ ఈనెల 30వ తేదీలోగా ప‌రిష్క‌రించ‌వ‌ల‌సి న ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ ని వెల్ల‌డించారు. తహసిల్దార్, ఆర్డి ఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్, సీసీఎ ల్ఏ, ఆపై ట్రిబ్యునల్ స్థాయిలలో అప్పీల్ వ్యవస్థను ఈ చట్టం అను సరించి రూపొందించినట్లు తెలిపా రు.

ప్రజలకు రెవెన్యూశాఖ సేవలు సు లభంగా, పారదర్శకంగా అందుబా టులోకి తేవడమే లక్ష్యంగా ప్రభు త్వం కార్యాచరణను అమలు చే స్తుందని పేర్కొన్నారు. భూభారతి కార్యక్రమం ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం వేగవంతం గా జరగడమే కాకుండా, రైతులకు నమ్మకమైన భూ సమాచారం అం దుతోందని మంత్రి తెలిపారు. వాస్త విక డేటాతో భూ పత్రాలను సమ ర్పించడం వల్ల భవిష్యత్తులో హ క్కులపై ఆందోళనలు తలెత్తవని స్పష్టం చేశారు.ఉద్దేశ్యపూర్వకంగా భూ సమస్యలను అ పరిష్కృతం గా ఉంచుతే సంబంధిత అధికారు లపై చర్యలు ఉంటాయన్నారు.

భూ యజమానుల భూ కమతా లకు మ్యాపులను పట్టాదారు పా సుపుస్తకంలో ముద్రించి ఇస్తామని తెలిపారు. ఆరువేల మంది లైసె న్సు కలిగి ఉన్న సర్వేయర్లను అధి కారికంగా నియమిస్తున్నామని చె ప్పారు. దీంతో భూముల హద్దుల గుర్తింపు ప్రక్రియ సులభతరం అ వుతుందని అన్నారు. అలాగే త్వ రలోనే గ్రామ రెవెన్యూ అధికారుల ను నియమిస్తున్నామని అన్నారు. భూములు ఉన్న ప్రతి ఒక్కరికి భూ భారతి చట్టం ద్వారా రక్షణ ఏర్ప డుతుందని అన్నారు. పట్టా లేని భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన పోడు భూముల రైతుల కు పట్టాలు అందజేస్తామని అన్నా రు. ఈ స‌మావేశాల్లో సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ త‌దిత‌ రులు పాల్గొన్నారు.

ఇందిర‌మ్మ ఇండ్ల‌పై ఆందోళ‌న వ‌ద్దు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని అన్నారు. తొలి విడతలో ఇండ్లు రానివారు ఆందో ళన చెందవద్దని అన్నారు. మొద టి విడతగా ప్రతీ నియోజక వర్గాని కి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, మరో నాలుగు విడతల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల ను అందిస్తామని మంత్రి పొంగు లేటి అన్నారు.