–కేంద్ర పథకాల్లో లోటు పాట్లను సవరించండి
–అట్టడుగు వర్గాల సంక్షేమానికి మాది పెద్ద పీట
–ములుగు కంటేయినర్ ఆసుపత్రి మోడల్ ను దేశ వ్యాప్తంగా విస్త రించండి
— ఆగ్రా సదస్సులో ప్రసంగించిన మంత్రి సీతక్క
Minister Sitakka: ప్రజా దీవెన, ఆగ్రా: పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ నిధులను పెంచాలని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క (Minister Sitakka)కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గత పదేల్లుగా కేంద్ర ప్రభుత్వం వృద్దులు, వికలాంగులు, వితం తుల నెలవారి పెన్షన్ మొత్తాన్ని పెంచలేదని గుర్తు చేసారు. వృ ద్దులు, వితంతులకు నెలకు రూ. 200, వికలాంగులకు రూ. 300 కేంద్రం ఇవ్వడం వల్ల ఆ పథకం లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఇక పేద వర్గాలకు సంబంధించిన పలు స్కీంల్లో కేంద్ర ప్రభుత్వం (Central Govt)కోతలు విధించడాన్ని సీతక్క తప్పుబ ట్టారు. యూపీలోని ఆగ్రాలో రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వ హించిన సామాజిక న్యాయం, సాధికారత సదస్సులో మంత్రి సీతక్క గురువారం ప్రసంగించారు. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. దీంతో పాటు కేంద్ర పథకాల నిధులను పెంచాల్సిన అవసరాన్ని సీతక్క ప్రధానంగా ప్రస్తావించారు. మొత్తం పది నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ఇటు రాష్ట్ర అవసరాలను నివేదించడంతో పాటు అటు కేంద్ర పథకాల్లో లోటు పాట్లపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని సీతక్క స్పష్టం చేసారు.
షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, వయో వృద్దులు, డ్రగ్స్ బాధితులు, ట్రాన్స్ జెండర్లు, ఆదివాసీలు, Drug victims, transgenders, tribals, nomads) సంచార జాతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, దివ్యాంగుల సంక్షేమం పై ఆగ్రా సదస్సులో ప్రధాన చర్చ జరగ్గా…ఆయా వర్గాలకు తెలంగాణలో అమలవుతున్న పథకాలను మంత్రి సీతక్క (Minister Sitakka)వివరించారు. దివ్యాంగులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, ఆదర్శ వివాహాలకు రూ, లక్ష నగదు ప్రొత్సహాకాలు, దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం రూ.50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ఆర్దిక సహకారం, 50 కోట్ల బడ్జెట్ తో దివ్యాంగుల పరికారాలు, వాహనాల పంపిణీ, వృద్దులు, వికలాంగుల కోసం ప్రత్యేక హస్టల్లు, ప్రత్యేక హెల్పైన్, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, వయోవృద్దుల ఫిర్యాదుల స్వీకరణ, విచారణ కోసం ప్రత్యేక యంత్రాంగం, ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు, వారి ఉపాధి కోసం రెండు లక్షల వరకు ప్రత్యేక ప్యాకేజీ, స్కిల్ సెంటర్లు, ప్రత్యేక వైద్య సదుపాయాలతో పాటు ఆయా వర్గాలకు అందిస్తున్న చేయుత పెన్షన్ల వివరాలను మంత్రి సీతక్క ప్రస్తావించారు.
తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీతక్క వివరించారు. మిషన్ పరివర్తన నినాదంతో పాఠశాలలు, కళాశాలలు, పనిప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. విద్యాశాఖలో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మత్తుపదార్థాల ప్రమాదాలపై ఇప్పటికే 10 లక్షల మంది యువతకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
కేంద్రం నిధులు పెంచాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా పలు సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు పెంచాలని సీతక్క డిమాండ్ చేసారు. వృద్దులు, వితంతులు, వికలాంగులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఇచ్చే నెలవారి పెన్షన్ ను గత పదేల్లుగా కేంద్ర ప్రభుత్వం పెంచ లేదని గుర్తు చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకుల పేదలే లబ్దిదారులుగా ఉంటున్నందున.. మానవతా దృక్పథంతో పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని కోరారు.
ఇక ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (National Maternity Benefit Scheme) కింద పేద మహిళలకు ప్రసూతి సమయంలో కేంద్ర ప్రభుత్వం 6 వేల రూపాయల ఆర్దిక చేయుత ఇస్తుంది. అయితే గతంలో అన్ని కాన్పులకు ఇచ్చే వారు. కాని ఇప్పుడు కేవలం ఒక కాన్పుకే ప్రసూతి ప్రయోజనాలను పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండో కాన్పుకు ఇవ్వకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీలు, పేదలకు నష్టం జరుగుతోంది. తల్లి పిల్లలకు పోషకాహారం లోపిస్తుంది. అందుకే పేదలకు ప్రయోజనం కలిగించే విధంగా కనీసం రెండో కాన్పుకు గతంలో మాదిరిగా ఈ స్కీం ను అమలు పరచాలని సీతక్క కేంద్రానికి విజ్నప్తి చేసారు.
గత పదేల్లలో కొత్త రేషన్ కార్డులను కేంద్రం మంజూరు చేయలేదని సీతక్క గుర్తు చేసారు. కుటుంబాలు పెరిగినా, కుటుంబ సభ్యులు పెరిగినా కేంద్రం రాష్ట్రాలకు రేషన్ కోటా పెంచడం లేదన్నారు. అందుకే కనీసం ఎస్సీ ఎస్టీ, బీసీ తదితర వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆహార భద్రత కార్డుల ఎంపిక కోసం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టాలని కోరారు.
ఇక మిడ్ డే మీల్ తరహాలో పాఠశాల విద్యార్ధులకు బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. పేద పిల్లలు ఏది తినకుండానే పాఠశాలకు రావడంతో చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేసారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతోన్నందున..ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు పొద్దున బ్రేక్ ఫాస్ట్ పెట్టే స్కీంను ప్రారంభిస్తే పిల్లల్లో గ్రహణ శక్తి, సంగ్రహణ సామార్ధ్యం పెరుగుతుందని సీతక్క పేర్కొన్నారు.
పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఆవాజ్ యోజన కింద ఇంటి నిర్మాణ వ్యయాన్ని 5 లక్షలు పెంచాలని కోరారు. తద్వారా ఎస్సీ ఎస్టీ పేదల సొంత ఇంటి కల నేరవేరుతుందన్నారు సీతక్క.
ములుగులో కంటేయినర్ ఆసుపత్రి మోడల్ ను దేశ వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుంది
దేశంలో దళితులపై అణచివేత పెరుగుతోందనీ సీతక్క ఆందోళన వ్యక్తం చేసారు. ఎస్సీలు
వివిధ రూపాల్లో వివక్షత ఎదుర్కుంటున్నారని..మరీ ముఖ్యంగా దళిత మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అత్యాచారాలకు, లైంగిక దాడులకు గురవుతున్న వారిలో అత్యధికులు దళితులే ఉన్నారన్నారు. అందుకే భాధితులకు సత్వర నాయ్యం అందేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు.
అడవుల్లో నివసించే ఆదివాసీల అభివృద్దికి కేంద్ర అటవి శాఖ ఎన్నో అభ్యంతారాలు చెబుతుందని సీతక్క తెలిపారు. కొత్త విద్యుత్ లైన్ వేయాలన్నా, రహదారి మార్గం కల్పించాలన్నా, మంచి నీటి పైపులు వేయాలన్న సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారని చెప్పారు. మైనింగ్ ఇతర కార్యకాలపాల కోసం లేని అభ్యంతరాలు..ఆదివాసీల అభివృద్ది విషయంలో ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించారు.
జన సాంద్రత తక్కువగా ఉండే ఆదివాసీ గూడేల్లో మౌళిక వసతులు కల్పనకు కేంద్రం చొరవ చూపాలన్నారు. అటవి ప్రాంతం ములుగులో కేవలం రూ. 5 లక్షలతో నిర్మించిన కంటేయినర్ ఆసుపత్రి ఆదివాసీలకు ఎంతగానే ఉపయోగపడుతుందని..అందుకే ఇదే తరహ ఆసుపత్రులను నిర్మించేలా ప్రొత్సహకాలివ్వాలని కేంద్రాన్నివిజ్నప్తి చేసారు.
సీతక్కకు అభినందించిన కేంద్ర మంత్రి, పలు రాష్ట్రాల మంత్రులు
ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతల శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించారు. తరచు ఇటువంటి సదస్సులను నిర్వహించడం ద్వారా అట్టడుగు వర్గాల ఆకాంక్షలను తెలుసుకోవడంతో పాటు వారి ఆత్మవిశ్వాసం పెంచిన వారమవుతామని సీతక్క పేర్కొన్నారు.
సీతక్క పది నిమిషాల పాటు చేసిన ప్రసంగాన్ని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, పలు రాష్ట్రాల మంత్రులు అభినందించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కేంద్ర పథకాల్లో చేయాల్సిన సవరణలను ఎవరి మనసును నొప్పించకుండా చాలా సహేతుకంగా వివరించినందుకు మెచ్చుకున్నారు. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా..దేశంలో అట్టడుగు వర్గాల ఆకాంక్షలు చెప్పడంతో పాటు..కేంద్ర పథకాలను మెరుగు పరచడానికి చేపట్టాల్సిన చర్యలను మంత్రి సీతక్క సూచించడంతో పలు రాష్ట్రాల మంత్రులు సీతక్క ను ప్రత్యేకంగా కలిసి అభినందలు తెలిపారు.