Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sitakka: వ‌య‌నాడ్ కు సీత‌క్క చేయూత‌

–సహాయర్ధంగా రూ.20 ల‌క్ష‌ల చెక్కును అందించిన మంత్రి
–దుస్తులు, నిత్య‌వ‌ర‌స‌ర వ‌స్తువుల అంద‌చేత‌
–ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన మంత్రి సీత‌క్క‌
-క‌న్నీటి గాధ‌లు, క‌ల‌చివేసే దృశ్యా లు చూసి భావోద్వేగo

Minister Sitakka: ప్రజా దీవెన, వయనాడ్: ప‌కృతి విల‌యానికి అత‌లాకుత‌మైన కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీత‌క్క (Minister Sitakka) శ‌నివారం ప‌ర్య‌టించారు. ములుగు డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో కలిసి ప్రభావిత ప్రాంతాలను సం దర్శించిన మంత్రి సీతక్క (Minister Sitakka), బాధిత కుటుంబాల సహాయార్థం తాను సేకరించిన రూ. 20 లక్షల చెక్ ను స్థానిక ఎమ్మెల్యే టి. సిద్దికి కి అం దించారు. దీంతో పాటు సుమారు ప‌ది ల‌క్ష‌ల విలువ‌గ‌ల దుస్తులు, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను స్థానిక నాయ‌కులు అంద‌చేసారు. వందల సంఖ్యలో మృతులను సామూహిక ఖననం చేసిన ముండక్కై స్మశాన వాటికలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అక్క‌డే మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చే క్ర‌మంలో భావోద్వేగానికి గుర‌ య్యారు మంత్రి సీత‌క్క‌ (Minister Sitakka).

వ‌య‌నాడ్ (wanayad)లో జూలై 30న‌ సంభ‌వించిన విప త్తు వంద‌ల‌ మందిని బలిగొన‌గా ఇప్ప‌టి వ‌ర‌కు చాల మంది ఆచూకి ల‌భించ లేదు. గుర్తు ప‌ట్ట‌రాని విధంగా మారిన మృత‌దేహాల నుంచి డీఎన్ఏ లు సేక‌రించి అక్క‌డి ప్ర‌భుత్వ‌మే ముండక్కై స్మశాన వాటికలో సామూహికంగా ఖ‌న‌నం చేసింది. త‌మ ఆప్తుల చివ‌రి చూపున‌కు సైతం నోచుకోని ఎంద‌రో పుట్టెడు దుఖంతో ముండక్కై స్మశాన వాటికలో త‌మ వారి స‌మాధుల‌ను వెతుక్కుంటున్నారు. త‌న త‌ల్లిని ఇక్క‌డే ఖ‌న‌నం చేసార‌ని తెలుసుకున్న ఓ యువ‌తి ఆ ప్రాంతానికి చేరుకుని.. చివ‌రి చూపున‌కు కూడా నోచుకోలేక‌పోయాను అంటూ త‌న త‌ల్లి స‌మాధి వ‌ద్ద బోరున విల‌పించింది. ఆ యువ‌తి శోకంతో మంత్రి సీత‌క్క భావోద్వేగానికి లోనైయ్యారు. యువ‌తిని ద‌గ్గ‌ర‌కు తీసుకుని అతి క‌ష్టం మీద ఓదార్చ గ‌లిగారు. అనంత‌రం స్థానిక మీడియాతో మాట్లాడిన‌ సీత‌క్క‌..ఇటువంటి క‌ష్టం ప‌గోడికి కూడా రావోద్ద‌న్నారు. ప్రభావితమైన ప్రాంతాలను చూసి హృదయం ద్రవించిపోతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోయిన ప్రాణాల‌ను తీసుకురాలేక‌పోయినా…త‌న‌కు ఎంతో అనుబంధం ఉన్న వ‌యానాడ్ ప్ర‌జ‌ల‌కు నైతిక మ‌ద్ద‌తు ప‌ల‌కానికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. వాయనాడ్ ఎల్లప్పుడూ త‌న‌ హృదయానికి దగ్గరగా ఉంటుంద‌న్నారు. నేటికి 24 గంటలూ పనిచేస్తున్న రెస్క్యూ టీమ్‌లు, స్థానిక అధికారులు, వాలంటీర్ల (volunter) అవిశ్రాంత ప్రయత్నాలను అభినందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. విపత్తు వల్ల న‌ష్ట‌పోయిన‌ వారి జీవితాలను పునర్నిర్మించడంలో.. సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందిస్తామ‌ని మంత్రీ సీత‌క్క భ‌రోసా ఇచ్చారు.

వ‌యనాడ్ తో మంత్రి సీత‌క్క‌కు మంచి అనుబంధం ఉంది. రాహుల్ గాంధి (rahul gandhi) వాయ‌నాడ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీత‌క్క విస్తృతంగా పాల్గొన్నారు. అక్క‌డ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన చాలా కార్య‌క్ర‌మాల‌కు సీత‌క్క హ‌జ‌ర‌య్యారు. అంత‌టి అనుబంధం ఉన్న వయానాడ్ ను ప్ర‌కృతి చిన్నా భిన్నం చేయ‌డంతో..సీత‌క్క త‌ట్టుకోలేక‌పోయారు. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు, అధికార కార్య‌క్ర‌మాలు, ఇత‌రాత్ర కార‌ణాల వ‌ల్ల వ‌యనాడ్ కు మంత్రి త‌క్ష‌ణం వెల్ల‌లేక‌పోయినా ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డి ప్ర‌జ‌ల యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. వయానాడ్ ప్ర‌జ‌ల స‌హ‌యార్ధం త‌న వంతుగా నిధుల‌ను స‌మీక‌రించడం మొద‌లు పెట్టారు. సీత‌క్క ప్ర‌య‌త్నాల‌ను తెలుసుకున్న ప‌లువురు నాయ‌కులు త‌మ వంతు స‌హ‌కారం ఆందించారు. ములుగు డీసీసీ (dcc)అధ్య‌క్షుడు పైడాకుల ఆశోక్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, టీపీపీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌త్తుమ‌ల్లేష్ త‌దిత‌ర నాయ‌కులు ఆర్ధికంగా స‌హ‌క‌రించారు. ములుగు, ఆదిలాబాద్ పార్టీ శ్రేణులు ముందుకొచ్చి చేయుత నిచ్చారు. మంత్రి సీత‌క్క భ‌ద్ర‌త, వ్య‌క్తిగ‌త సిబ్బంది సైతం త‌మ వంతుగా రూ.50 వేల స‌హాయం చేసారు. వ‌యనాడ్ ప్ర‌జ‌ల కోసం ముందు కొచ్చి నిధులు, వ‌స్తువులు అంద‌చేసిన వారికి, బాల‌వికాస్ వంటి స్వ‌చ్చంధ సంస్థ‌ల‌కు మంత్రి సీత‌క్క కృత‌జ్న‌త‌లు తెలిపారు.