–సిఐటియు మండల కన్వీనర్ కానుగు లింగస్వామి
Minister Sri Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన/ కనగల్:
వచ్చే బడ్జెట్ సమావేశాలలో ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 నిర్ణయించాలని రోడ్లు అండ్ భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు మంత్రి కనగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య కేంద్రం నూతన భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా వారు వినతిపత్రం అందజేశారు .
ఈ సందర్భంగా సిఐటియు కనగల్లు మండల కన్వీనర్ కానుగు లింగస్వామి మంత్రిగారికి ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందని చెప్పిన దాని ప్రకారం వేదలు ఇవ్వాలన్నారు పిఎఫ్ ఈఎస్ఐ ఇతర సమస్యల పరిష్కారమయ్యే విధంగా అసెంబ్లీలో కృషి చేయాలని మంత్రిగారికి విన్నవించారు ఆశా యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు నకరెకంటి సైదమ్మ కట్ట స్వర్ణ ,జీవనజ్యోతి ,హైమావతి స్వప్నతదితరులు పాల్గొన్నారు