–తెలంగాణలో ఉన్న అనుకూల తలను తెలియజెప్పoడి
–ఫ్రెంచ్ కంపెనీలు విరివిగా వచ్చే వి ధంగా చొరవచూపండి
–ఇఫ్కీ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu: ప్రజా దీవెన, హైదరాబాద్: భావిత రాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠా త్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ‘ఇం డో, ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ(ఇఫ్కీ)’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంగ ళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచి వాలయంలో ఇఫ్కీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం చారు. తెలంగాణలో పరిశ్రమల ఏ ర్పాటుకున్న అనుకూలతలు, ప్ర భుత్వం తరఫున అందిస్తున్న ప్రో త్సాహాకాలను ఈ సందర్భంగా ఆ యన వివరించారు.
తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టితోనే సీఎం రేవంత్ రెడ్డి 30వేల ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృ ద్ధికి శ్రీకారం చుట్టారని, ఇది ఒక న గరం కాదు. భవిష్యత్తు అంతర్జాతీ య భాగస్వామ్యంతో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న దే మా సంకల్పమని వివరించారు. ‘ఏడాదిన్నర వ్యవధిలోనే తెలంగా ణకు రూ.3 లక్షల కోట్ల పెట్టబడులొ చ్చాయని, గతేడాది హైదరాబాద్ లో 70 జీసీసీలు ప్రారంభమయ్యా యన్నారు.
పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం పై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. పరిశ్రమలకు అవసరమైన అన్ని ర కాల మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతిభ గల మానవ వనరులకు కొరత లే దు. మరింత వేగంగా, సరళంగా పా రదర్శకంగా అనుమతులిచ్చేందుకు టీజీ, ఐపాస్ ను ఏఐతో అనుసం ధానం చేసేందుకు చర్యలు తీసు కుంటున్నామని చెప్పారు.
‘ఏరో స్పేస్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసిం గ్, ఐటీ లాంటి రంగాల్లో పలు ఫ్రెంచ్ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో పె ట్టుబడులు పెట్టాయి. సనోఫి, మోని న్, సఫ్రాన్, క్యాప్ జెమినీ, డసాల్ట్, టెలీ పర్ ఫార్మెన్స్, ఓపెల్లా హెల్త్ కేర్ లాంటి దిగ్గజ సంస్థలు తమ కార్య కలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నా యన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, డిజిటల్ గవర్నెన్స్, ఆగ్రో ఇన్నోవేషన్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, ఫ్యూచర్ రెడీ ఎడ్యు కేషన్, సస్టైనబుల్ మ్యానుఫాక్చరిం గ్ తదితర రంగాల్లో మంచి అవకా శాలున్నాయి. దీన్ని ఫ్రాన్స్ పారిశ్రా మికవేత్తలు సద్వినియోగం చేసుకు నేలా చొరవ చూపండని ఇఫ్కీ ప్రతి నిధులను కోరారు.
‘తెలంగాణ , ఫ్రెంచ్’ మధ్య ద్వై పాక్షిక సహకారాన్ని మరింత మెరు గుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సి ద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఇఫ్కీ నుంచి యోహాన్ సామ్యూల్, ప్రియాంక్ ప్రకాష్, నకుల్ దల్వాలా, మోనిన్, ఓపెల్లా హెల్త్ కేర్, సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇం డియా, సనోఫీ ఇండియా, టెలిపర్ ఫార్మెన్స్, వార్ ఎలక్ట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, జీగ్లర్ ఏరోస్పేస్ తదితర పలు ఫ్రెంచ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.