Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sridhar Babu: స్కిల్ వర్సిటీ అభివృద్ధికి సహకరిం చండి

–కేంద్ర మంత్రి జయంత్ చౌదరికి విజ్ఞప్తి
–నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధం
–మెగా జాబ్ , స్కిల్ & లోన్ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణను “స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ ల్”గా మార్చాలనే సంకల్పంతో రా ష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇం డియా స్కిల్ యూనివర్సిటీ అభి వృద్ధికి సహకరించాలని కేంద్ర నైపు ణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని మంత్రి శ్రీధర్ బాబు కోరా రు. సోమవారం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ , ఎంటర్ప్రెన్యూర్షిప్ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా), డి ప్టారెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్(తెలంగాణ) సంయుక్తాధ్వ ర్యంలో బషీర్ బాగ్ లోని పీజీ లా క ళాశాలలో ఏర్పాటు చేసిన “మెగా జాబ్/స్కిల్ & లోన్ మేళా”ను కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో కలిసి ఆ యన లాంఛనంగా ప్రారంభించి మా ట్లాడారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..

“తెలంగాణ యువత ప్రతిభే మా రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద ఆస్తి. కా నీ, చాలా మందిలో పరిశ్రమలకు కా వాల్సిన నైపుణ్యాలు ఉంటడం లే దు. పరిశ్రమలు, విద్యా సంస్థలు మ ధ్య నెలకొన్న అంతరాన్ని రేవంత్ రె డ్డి నేతృత్వంలోని మా ప్రభుత్వం గుర్తించిందని వివరించారు. అంద ర్నీ కలుపుకొని పోయే ప్రభుత్వం మాది. నైపుణ్యాభివృద్ధిలోనూ పరి శ్రమలు, నిపుణులను భాగస్వా మ్యం చేస్తున్నాం. వారి సహకారం తోనే స్కిల్ యూనివర్సిటీ లో కోర్సు లకు రూపకల్పన చేస్తున్నాం. ఇక్క డ శిక్షణ తీసుకున్న యువతలో 80 శాతం మందికి ఉద్యోగాలు లభిం చాయని వివరించారు.

“మీలో ఎంతో ప్రతిభ ఉంది. మా రుతున్న పరిస్థితులకు అనుగుణం గా మీరు మారాలి. టెక్నాలజీ సా యంతో కొత్త నైపుణ్యాలను నేర్చు కునేందుకు ప్రయత్నించండి. ఓట మికి నిరుత్సాహం చెందకుండా ప్ర యత్నం చేస్తూనే ఉండండి. తప్ప కుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని యువతకు సూచిం చారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించాలని కేం ద్ర మంత్రి జయంత్ చౌదరిని ఆ హ్వానించారు. నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా రు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్.కృష్ణ య్య, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, తెలంగా ణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేష న్ లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.