Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, అసహనం, నిరాశతోనే మా ‘కేబినే ట్’పై నిరాధారమైన ఆరోపణలు
Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: దండు పాళ్యం’ పాలన అంటే ఎవరిదో అం దరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల కు బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరి శ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అందుకే గట్టిగా క ర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చే శారు. అధికారం లేదన్న అసహనం, నిరాశలో ‘కేబినేట్’పై ప్రతిపక్షాలు చే స్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించా రు. మంత్రుల మధ్య కుమ్ములాట లు, కేబినేట్ సమావేశంలో వర్గాలు గా విడిపోయి గొడవలు పడ్డారం టూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. అలాంటి వారం తా సినిమాల్లో ‘రచయితలు’ గా ప్ర యత్నించాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కే బినేట్ సమష్ఠిగా రాష్ట్రాభివృద్ధి కో సం పని చేస్తుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం చిత్త శుద్ధితో అహర్నిశలు శ్రమిస్తున్న మా మంత్రులకు ప్రత్యేకంగా వ్యక్తిగత అ జెండా అంటూ ఏదీ లేదన్నారు. మా కు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజ ల ఆశయాలు, ఆకాంక్షలే మా అం దరి అజెండా అని తేల్చి చెప్పారు. మేం వేసే ప్రతి అడుగు రాష్ట్రాభివృ ద్ధి కోసమేనని, ఈ విషయంలో ఎ లాంటి అపోహాలకు తావు లేదని స్పష్టం చేశారు. ‘విలువ ఆధారిత వృద్ధే’ లక్ష్యంగా మా ప్రభుత్వం పా రదర్శక పాలన అందిస్తుందన్నారు.
మేం పాలనను గాలికొదిలేస్తే గత 0 నెలల్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టు బ డులు రాష్ట్రానికి వచ్చేవా అని ప్ర శ్నించారు. మంత్రులంతా వ్యక్తిగ త పంచాయతీలు పెట్టుకుంటే “ఎలీ లి ల్లీ” లాంటి అంతర్జాతీయ దిగ్గజ కం పెనీలు తెలంగాణకు ఎలా వస్తు న్నాయని ప్రశ్నించారు. మాది మాట ల ప్రభుత్వం కాదని, చేతల్లో చేసి చూపించే ప్రజా ప్రభుత్వమని గు ర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అంతర్గత కుమ్ములాటలను క ప్పిపుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. మీ అహంకార పూరి త వ్యవహారశైలి, పాలనా వైఫల్యా ల చరిత్రను దాచుకునేందుకు ఇ లాంటి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమ ర్శించారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజ లు మీ కుతంత్రాలను నమ్మరని గు ర్తు చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించా లని లేదంటే రాబోయే రోజుల్లో ప్ర జ లే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
*6 నెలల్లోనే రూ.12,864 కోట్ల ఎఫ్ డీఐలు* ‘పారిశ్రామికాభివృద్ధి విషయంలోనూ మాపై దుష్ప్రచా రం చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పె ట్టుబడుల(ఎఫ్ డీఐ) ఆకర్షణలో తె లంగాణ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెల ల్లోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్ డీఐలు వచ్చాయి. 2023– 24లో ఇదే కాలంతో పోలిస్తే 33 శా తం ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనే టాప్ – 3 అర్బన్ ఎఫ్ డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘2023-24లో పరిశ్రమల జీఎస్ వీఏ రూ.2.46 లక్షల కోట్లు. అది 2024-25లో 12.6 శాతం పెరి గి రూ.2.77 లక్షల కోట్లకు చేరుకుం ది. వృద్ధి రేటు 8.68 శాతం. గతేడా దితో పోలిస్తే 2.1 శాతం అధికంగా నమోదయ్యింది. అదే జాతీయ సగ టు వృద్ధి రేటు 6.2 శాతం మాత్రమే’ అని పేర్కొన్నారు. ఇకనైనా వాస్త వాలు తెలుసుకొని మాట్లాడాలని ప్ర తిపక్షాలకు సూచించారు.