Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, మా ప్రజా ప్రభుత్వం ప్రతిఅడుగు ప్రజల కోసమే

Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: మా ప్ర జా ప్రభుత్వం వేసే ప్రతి అడుగు తె లంగాణ ప్రజల కోసమేనని రాష్ట్ర ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్ బాబు స్పష్టం చేశారు. గురువా రం హైదరాబాద్ లోని యూఎస్ కా న్సులేట్ జనరల్ కార్యాలయ ప్రాంగ ణంలో రూ.1.5 కోట్లతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పో రేషన్(టీజీఐఐసీ) అత్యాధునిక వ సతులతో నిర్మించిన ‘తెలంగాణ స్టే ట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియా’ ను ఆయన లాంఛనంగా ప్రారంభిం చారు.

 

‘హైదరాబాద్ లోని యూఎస్ కా న్సులేట్‌కు ప్రతిరోజూ 3వేల మం ది కి పైగా సందర్శకులు వస్తుంటారు. వేచి చూసేందుకు సరైన సౌక ర్యా లు లేక ఇక్కడికొచ్చే వారు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నట్లు మా దృష్టికొచ్చింది. క్షేత్రస్థాయిలో అధ్య యనం చేసి ఎక్కడెక్కడె ఏం అవ సరమో గుర్తించి అందుకు అనుగు ణంగా అత్యాధునిక వసతులతో కూడిన వెయింటింగ్ ఏరియాను అందుబాటులోకి తీసుకొచ్చాం. కే వలం పారిశ్రామిక, సాంకేతిక రంగా లకే పరిమితం కాకుండా, ప్రజల రో జువారీ జీవితాల్లో మార్పు తెచ్చేం దుకు మా ప్రభుత్వం తీసుకుంటు న్న చొరవకు ఇది నిదర్శనమని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వి వరించారు.

‘తెలంగాణ, అమెరికా మధ్య ద్వై పాక్షిక సంబంధాల బలోపేతానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తోంది. ఫార్మా, ఏరోస్పేస్, ఎల క్ట్రానిక్స్, ఈవీ రంగాల్లో అమెరికా మన రాష్ట్రానికి అగ్రగామి వ్యాపార భాగస్వామి. మన ఐటీ ఎ గుమతు ల్లో 38 శాతం ఉత్తర అమెరికాకు జ రుగుతున్నాయి. గూగుల్, అమెజా న్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపం చ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా ఉంది. ఈ ఏడా ది ఒక్క జనవరిలోనే అమెరికా కం పెనీలు మన రాష్ట్రంలో రూ.31,5 00 కోట్ల పెట్టుబడులను పెట్టాయి. ఫలితంగా 30వేల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి’ అని చెప్పారు.

 

ఈ కొత్త వెయిటింగ్ ఏరియా ద్వా రా అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం వ్యాపారానికే పరిమితం కా కుండా ప్రజల మధ్య సత్సంబంధా లను బలోపేతం చేసేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అమెరి కా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్స న్ తదితరులు పాల్గొన్నారు.