Minister Thummalla Nageshwara Rao : మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్య, సుమోటోగా నేనే పీసీ ఘోష్ ముం దుకు వెళ్తా
Minister Thummalla NageshwaraRao: ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వ రం ప్రాజెక్టు అంశం అసలు కేబినెట్ ముందుకే రాలేదని, అప్రూవల్ పొం దలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జస్టి స్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మా జీమంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రా జేందర్ అన్ని అబద్ధాలు చెప్పారని అన్నారు. ఆయన సమాధానాలు వాస్తవదూరంగా ఉన్నాయన్నారు.
శనివారం సచివాలయంలో తుమ్మ ల మాట్లాడుతూ ఈటల అనాలో చి తంగా వాంగ్మూలం ఇచ్చారా లేదం టే ఆ రకంగా ఇవ్వాల్సిన పరిస్థితు లు ఆయనకు ఏమైనా వచ్చాయా అని ప్రశ్నించారు. ఈటల సబ్ కమి టీ విషయాన్ని ప్రస్తావించారని, అ యితే కాళేశ్వరం నిర్మాణం కోసం వే సింది కాదని తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజీకి అనుమతులు ఇచ్చిన 15 రోజులకు రాష్ట్రంలో ఉ న్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణా నికి తనకు ఎలాంటి సంబంధం లేద ని, అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని, తప్పుడు ప్రకట న లతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలే రని తుమ్మల మండిపడ్డారు. తాను సుమోటోగా జస్టిస్ పీసీ కమిషన్ ముందుకు వెళ్తానని, వివరాలన్నీ వెల్లడిస్తానని స్పష్టం చేశారు.