
–రిజర్వేషన్ లపై సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు నమ్మొద్దు
–కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశం లో నేతలు గుమ్ముల, బుర్రి
Nalgonda Municipal Elections : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిల ర్ అభ్యర్థుల టికెట్ కేటాయింపు వి షయంలో మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి దే తుది నిర్ణయమని నల్లగొం డ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గు మ్ముల మోహన్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రె డ్డి లు తేల్చి చెప్పారు. త్వరలో జర గనున్న మున్సిపాలిటీ ఎన్నికల నే పథ్యంలో ఆదివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాం పు కార్యాలయంలో అన్ని వార్డుల మాజీ కౌన్సిలర్లు, బూత్ ఇన్చార్జీ లు, ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
నల్లగొండ మున్సిపల్ వార్డు కౌన్సిల ర్ల పార్టీ టికెట్ కేటాయింపుకు సం బంధించి ఇప్పటివరకు ఎవ్వరికీ హా మీ ఇవ్వలేదని, మున్సిపాలిటీ ఎ న్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికె ట్ ఎవరికి వచ్చినా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందేనని, అందు కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండా ల్సిందేనని స్పష్టం చేశారు.
నల్గొండ పట్టణంలో 48 వార్డులు ఉండగా రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కే టాయించిన తర్వాత గెలుపు అవ కాశాలు అధికంగా ఉన్నవారికే మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయక త్వంలో వార్డు కౌన్సిలర్ల అభ్యర్థుల ఖరారు చేయబడుతుందని తెలిపా రు.
ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు అయి నట్లు, సీట్లు కేటాయించినట్లు సో షల్ మీడియాలో కొందరు తప్పుడు పోస్టులు పెడుతూ అయోమయా నికి గురి చేస్తున్నారని, అటువంటి వదంతులను ఎవ్వరు కూడా నమ్మ వద్దని సూచించారు.
పట్టణంలోని ప్రతి వార్డులో మంత్రి కోమటిరెడ్డికి సంబంధించి సోషల్ మీడియా గ్రూపు ఏర్పాటు చేసుకొ ని అభివృద్ధి కార్యక్రమాలు,పార్టీ కా ర్యక్రమాలను వివరించాలని, సోష ల్ మీడియాలో వ్యక్తిగత కార్యక్రమా లకు ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచిం చారు.
నల్లగొండ పట్టణంలో అన్ని వార్డుల లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జ రుగుతున్నాయని తెలిపారు. అం డర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరిగే ట ప్పుడు ప్రజలకు కొంత ఇబ్బందులు తలెత్తుతాయని, వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల ఓటర్ల జా బితాలో వార్డుల ఓటర్లు ఇతర వా ర్డులో, ఇతర వార్డుల ఓటర్ల జాబి తా మనవార్డులలో పడినప్పుడు వీ టన్నింటినీ మున్సిపాలిటీ అధి కా రుల దృష్టికి తీసుకువెళ్లాలని సూ చించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో కూడా ఓటర్ల జాబితా పై మున్సి పాలిటీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సవరించే విధంగా చర్యలు తీ సుకోవడం జరుగుతుందని పేర్కొ న్నారు.
ఓటరు జాబితాపై అభ్యంతరాలకు సంబంధించి ఈరోజే చివరి రోజు కా వడంతో ఆయా వార్డుల మాజీ కౌ న్సిలర్లు, బూత్ ఇన్చార్జీలు, ము ఖ్య నాయకులు మున్సిపాలిటీ అధి కారులకు ఫిర్యాదు చేయాలని సూ చించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ అబ్బ గో ని రమేష్ గౌడ్ పాల్గొన్నారు.





