Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Tummala Nageswara Rao: వానకాలం నాట్ల లోపే రైతు ఖాతా ల్లో రైతు భరోసా వేస్తాం

— రైతులు కొత్త పంటల ఆవిష్కరణ చేయాలి
–సాంప్రదాయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి
–రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు

Minister Tummala Nageswara Rao: ప్రజా దీవెన, చిట్యాల: రైతు వ్యవ సాయ రంగంలో అన్ని ఒడిదు డు కులను ఎదుర్కొని నిలదొక్కు కు న్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉం టుందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అ న్నారు.ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తుందని , వ్య వసాయాన్ని పండగ చేయడంలో సహకరిస్తుందని తెలిపారు. ఈ సం వత్సరం 15 రోజుల ముందే తొల కరి పలకరించిందని, ఇందుకు తగ్గ ట్టుగా రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో ప్రణాళిక చేసుకోవాల ని కోరారు. దేశంలోనే అత్యధిక ధా న్యాన్ని పండించిన రాష్ట్రంగా తెలం గాణ నిలిచిందని, ధాన్యం పండించి న రైతులకు 1150 కోట్ల రూపాయ లు వారి ఖాతాలలో వేయడం జరి గిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ కిం ద 70 వేలకోట్ల రూపాయలు జమ చేస్తే,తెలంగాణలో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి పంటకే 2 లక్షలలోపు ఋణాలున్న రైతుల ఖాతాలలో 28 వేల కోట్లను జమ చేసినట్లు ఆ యన వెల్లడించారు. రైతు భరో సా, రైతు భీమా, ఎరువులు, విత్తనాలు సకాలంలో ఇచ్చినప్పుడే రైతు సక్ర మంగా వ్యవసాయం చేయగలడ న్నారు.


కోటి 50 లక్షల రూపాయల వ్య యంతో నల్గొండ జిల్లా చిట్యాల మండల వ్యవసాయ మార్కెట్ యా ర్డులో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ఆయన బుధవారం ప్రారంభిం చారు. వ్యవసాయ మార్కెట్లో నిర్వ హించిన నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనం తరం మంత్రి మాట్లాడారు. ఈ వా నాకాలం రైతులు నాటు పెట్టకముం దే రైతు ఖాతాలలో రైతు భరోసాని ధులు వేస్తామని చెప్పారు. తొలకరి ముందుగానే వచ్చినందున రైతులు ముందుగానే నాట్లు వేసుకోవాలని, అకాల వర్షాలు, అనుకొని సంఘ ట నలు జరిగినప్పుడు తట్టుకొని నిల బడే విధంగా రైతు పంటలు వేసుకో వాలని, ముఖ్యంగా ఆయిల్ ఫామ్, సాంప్రదాయ వంటల వైపు మొగ్గు చూపాలని, నల్గొండ జిల్లాలో త్వర లోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏ ర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్ల డించారు.

తక్కువ నీటితో అధిక దిగుబడిని చ్చే కొత్త పంటలను పండించాలని ఆయన పిలుపునిచ్చారు. జాజి, ఒక్క, పామాయిల్ వంటి పంటల ను సాగు చేయాలని ,అలాగే ఇతర కొత్త పంటల ఆవిష్కరణకు రైతుల కు కృషి చేయాలని పిలుపునిచ్చా రు. వరి పత్తితో పాటు ,మనకు అ వసరమయ్యే పంటలను పండించా లని, పంటలు బాగా పండాలంటే పురుగుమందులు, యూరియా వా డకం తగ్గించాలని, సాంప్రదాయ వ్యవసాయానికి వెళ్లాలని, వ్యవసా యాన్ని పండుగ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుకు పూర్తిగా సహకరి స్తుందని చెప్పారు.రాష్ట్రంలో అభి వృద్ధి , సంక్షేమ కార్య క్రమాలను స మానంగా ముందుకు తీసు కెళుతు న్నామని, చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ లో ఉన్న 8 గ్రామాలను చి ట్యాల మార్కెట్ యార్డ్ లోకి విలీ నం చేయడం, నార్కెట్ పల్లి సబ్ మా ర్కెట్ యార్డులో మిగిలిపో యి న పనులు ,గోడౌన్ మంజూరు విష యం ఆలోచిస్తామని తెలిపారు.

రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా, రైతు బీమా, విద్యుత్, ఎ రువులు, విత్తనాలు వంటివి సకా లంలో రైతుకు అందజేసినప్పుడు రైతు సరైన విధంగా పంటలు పం డించగలుగుతాడని తెలిపారు. దే శంలోనే అత్యధికంగా వరి పండిం చిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం
ఘనత సాధించిందని అన్నారు. రోహిణి కార్తిలోనే వర్షాలు వచ్చి నందున రైతులు ముందే నాట్లు వేసుకునేందుకు సిద్ధం కావాలని, వారం, పది రోజుల్లో రైతు భరోసా వస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీల కు ప్రత్యేక స్థానం ఉందని, మార్కెట్ల కు ఉన్న పేరు ప్రతిష్టాలను కాపాడా ల్సిన బాధ్యత కొత్త మార్కెట్ కమి టీల పై ఉందని చెప్పారు.

హైదరాబాద్- విజయవాడ జాతీ య రహదారిపై చిట్యాల వద్ద ఏర్పా టు చేస్తున్న వెండ్ల విషయంలో జా తీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల ని ఆయన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి సూచించారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చా మల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడు తూ ప్రతి గ్రామానికి ప్రజాపాలన అందించే దిశగా ప్రభుత్వం అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తున్నదని, మంత్రుల ప్రత్యేక పర్యవేక్షణలో పరిపాలన కొనసాగు తున్నదని, చిట్యాల జాతీయ రహ దారిపై అండర్ పాస్ నిర్మాణం విష యమై జాతీయ రహదారి సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలి పారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహిం చిన స్థానిక శాసనసభ్యులు వేము ల వీరేశం మాట్లాడుతూ చిట్యాల మార్కెట్ యార్డ్ పరిధిలోకి వచ్చే ఎనిమిది గ్రామాలు చౌటుప్పల్ మా ర్కెట్ యార్డులో ఉన్నాయని, వాటి ని చిట్యాల మార్కెట్ యార్డ్ లో వి లీనం చేయాలని ,నార్కెట్ పల్లి సబ్ మార్కెట్ యార్డులో మిగిలిపోయిన పనులను పూర్తి చేయటం , గోడౌను చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కి విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర డైరీ డెవల ప్మెంట్ చైర్మన్ గు త్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ చి ట్యాల వ్యవసా య మార్కెట్ యార్డ్ కు మంచి పేరు ఉందని, దీనిని ఆ లాగే కొనసాగిం చాలని కోరారు.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతున్నదని, బడు గు, బలహీన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అ న్నారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కై రూపొందించిన గోడ పత్రికను మంత్రి ఆశ వర్కర్లతో కలిసి ఆవి ష్కరించారు. చిట్యాల నూతన వ్య వవ్యవసాయ మార్కెట్ కమిటీ చై ర్మన్ గా నర్రా వినోద, వైస్ చైర్మన్ గా ఐతరాజు యాదయ్య తో పా టు మరో పదహారు మంది సభ్యులుగా జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు.నూతన వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా సభ్యులుగా ప్ర మాణం స్వీకారం చేసిన వారికి మం త్రి,ఎంపీ, ఎమ్మెల్యేలు శుభాకాంక్ష లు తెలియజేశారు.

అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆ ర్డిఓ వై. అశోక్ రెడ్డి ,వ్యవసాయ శా ఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, జి ల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సం చాలకులు ఛాయాదేవి, పిఎసిఎస్ చైర్మన్ మల్లేష్ గౌడ్, మాజీ మున్సి పల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి తది తరులు పాల్గొన్నారు.