Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy :మంత్రి ఉత్తమ్ ఫైర్, అబద్ధాలు మా నుకో హరీష్ రావు అంటూ హితవు

Uttam Kumar Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో ధాన్యం కొనుగోలు అంశంలో అ బద్దాలు మానుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావుకు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.ప్రతిరోజు అ బద్దాలను ప్రచారం చేస్తూ అవే ని జాలుగా ప్రజలను భ్రమింపచేసే ప్ర యత్నం మానుకోవాలని ఆయన ఉద్బోధించారు. ఈ మేరకు మంగ ళవారం సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు వ్యాఖ్యలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రా వు చేసిన ప్రకటన ప్రజలను తప్పు దోవపట్టించే విదంగా ఉందని ఆ యన ఆక్షేపించారు.

ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టు అ సత్య ప్రచారం చేస్తూ ప్రజలను ధా న్యం కొనుగోలు విషయంలో హరీష్ రావు తప్పు దోవ పట్టిస్తున్నారని ఆ యన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు గొప్పగా ప్రచారం చేసుకున్న కాళే శ్వరం నిరుపయోగంగా మారిన ఖరీఫ్, రబి సీజన్లను కలిపి దిగు బడి అయిన ధాన్యం 281లక్షల మెట్రిక్ టన్నులని ఆయన వివరిం చారు.

యాసంగి సీజన్ లో ఇప్పటికే 65 శాతం మేర ధాన్యం కొనుగోళ్లు పూ ర్తి అయ్యాయని కిందటేడాది కంటే 44 శాతం అధికమని గడిచిన రెం డేళ్ల యాసంగి సీజన్ తో పోల్చి చూస్తే 120 శాతం అధికంగా కొను గోళ్లు జరిగాయని ఆయన వివరిం చారు.

యాసంగి సీజన్ లోనూ ధాన్యం ది గుబడి లో తెలంగాణా రాష్ట్రం రి కార్డు సాదించిందని ఆయన పేర్కొ న్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖరీఫ్ సీజన్ లో 66.7 లక్ష ల ఎకరాలు సాగు చేస్తే 153.5 లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందని, ప్రస్తుత యాసంగి సీ జన్ లో 55 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 127 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం దిగుబడి అంచనా వేస్తున్నా మన్నారు.అంటే కాంగ్రెస్ పార్టీ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన సం వత్సరం వ్యవదిలోనే ఖరీఫ్, రబీ సీజన్ లు కలిపి దిగుబడి అయ్యో మొత్తం కలిపి 280 లక్షల మెట్రిక్ టన్నులన్నారు.

ధాన్యం దిగుబడిలో ఇదో చారిత్రా త్మకమైన రికార్డుగా ఆయన అభివ ర్ణించారు. ఈ యాసంగి సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 65 శాతం మేర ధాన్యం కొనుగోలు పూ ర్తి చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ రోజు సాయంత్రం వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధా న్యం 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ని ఆయన వెల్లడించారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడి యా వేదికగా విడుదల చేసిన ప్రక టనలో ధాన్యం కొనుగోలు వివరా లను సమగ్రంగా వివరించారు. 20 23-24 యాసంగి సీజన్ తో పోల్చి చూసినప్పుడు ఈ యాసంగి సీజన్ లో ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం వరకు కొనుగోలు చేసింది 23.48 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉన్నాయాన్నారు. అదే విదంగా 20 23-24 అంటే గతేడాదితో పోల్చి చూస్తే కూడా ప్రభుత్వం తాజాగా కొనుగోలు చేసింది 13.22 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగో లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ప్రభుత్వం ప్రారంభించిన ధా న్యం కొనుగోలు కేంద్రాలు 8,245 అని గతేడాది కంటే అదనంగా 1,0 67 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిం చామన్నారు.

ఈ యాసంగి సీజన్ లో 60.14 ల క్షల ఎకరాలలో రైతులు సాగు చే యగా లక్షా 29 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం దిగుబడి అవ్వుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొ న్నారు. అందులో 70.13 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేం ద్రాలకు వస్తున్నట్లు ప్రభుత్వం అం చనా వేస్తోందన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.58 లక్షల మంది రైతుల నుండి ప్రభుత్వం ధాన్యాన్ని కొను గోలు చేసిందన్నారు.ప్రభుత్వం కొ నుగోలు చేసిన 43.10 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యంలో 27. 75 లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యాం దొడ్డు రకాలని,15.35 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యాం సన్నాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.ప్రభుత్వం కొను గోలు చేసిన ధాన్యాం మొత్తం విలు వ 9,999.36 కోట్లు అని ఇప్పటి వ రకు ప్రభుత్వం రైతులకు చెల్లించిన మొత్తం 6,671 కోట్లు అని ఆయన తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేసిన 48 గం టల వ్యవధిలోనే రైతుల ఖాతా లలో నగదును జమ చేస్తున్నామ న్నారు.రాష్ట్ర ప్రభుత్వం సన్నాలను ప్రోత్సాహించేందుకు గాను అత్యం త ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స న్నాలకు బోనస్ పధకం యాసంగి లోనూ అమలు పరుస్తున్నట్లు ఆ యన చెప్పారు. సన్నాలకు క్వింటా ఒక్కింటికీ 500 రూపాయల బోనస్ ను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపా రు. ప్రభుత్వం కొనుగోలు చేసిన స న్నాలకు అందించాల్సిన బోనస్ మొత్తం 767 కోట్లు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.