Minister Uttam Kumar Reddy: ప్రజా దీవెన ,కోదాడ: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి లభ్యతను మెరుగుపరిచేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్ని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులనుఆదేశించారు బుధవారం చింతలపాలెం మండలం లోని అంజనీ సిమెంట్ ఆడిటోరియంలో ముత్యాల బ్రాంచ్ కెనాల్ నక్కగూడెం రాజీవ్ గాంధీ లీప్ట్ ఇరిగేషన్ పథకాల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణాజిల్లాల పంపకంపై బ్రిటిష్ క్రిమినల్ పై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దక్షిణ తెలంగాణను ఎడారి ప్రాంతంగా మార్చారన్నారు కృష్ణా జలాల పంపకాలలో న్యాయం జరగలేదని కేసుని తిరిగి తెరిపించి క్రిమినల్ లో స్వయంగా వాదనలు వినిపిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణకు 70% వాటా సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 2008లో ప్రారంభించి 2012లో పూర్తి అయిన ఈ పథకం 2018 తర్వాత మరమ్మతులు లేక రైతులు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు ఇప్పుడు దీనిని మళ్లీ 37.70 కోట్లతో పునరుద్ధరించి 3200 ఎకరాల సాగునీటిని అందించేందుకు 2025 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని అధికారం ఆదేశించారు ముత్యాల బ్రాంచ్ కెనాల్ ఇందిరాగాంధీ ఎత్తిపోతల పథకం ఈ పథకం ద్వారా మఠంపల్లి మేళ్లచెరువు చింతలపాలెం మండలాల్లో మొత్తం 53 వేల ఎకరాల సాగునీటిని అందరూ అన్ననున్నదని మొత్తం 1450 కోట్లు కాగా 2026 ఆగస్టు పూర్తి చేయాలని తెలిపారు రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈ పథకానికి 394 కోట్ల ఖర్చుతో మేళ్లచెరువు కోదాడ హుజూర్నగర్ చింతలపాలెం చిలుకూరు మండలాల్లో 12 గ్రామాలలో 14 వేల 100 ఎకరాల సాగునీరు అందించనున్నారని తెలిపారు 2026 మే నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మొత్తంగా మూడు పథకాల ద్వారా 71 వేల ఎకరాలు సాగునీటి సాగులోకి వస్తుందని ఈ మూడు పథకాల ద్వారా మొత్తం 71 వేల ఎకరాల సాగులోకి వస్తుందని మంత్రి తెలిపారు.
ఈ భూసేకరణకు రైతులు సహకరించాలని నష్టపరిహారం వెంటనే అందించబడుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్, ఆర్డీవో శ్రీనివాసులు, ఇరిగేషన్ సి ఈ రమేష్ బాబు ,ఎస్ ఈ శివధర్మ తేజ ,డిఈలు చారి, హరి కిషోర్, తాసిల్దార్ మహేందర్ రెడ్డి, ఎంపీడీవో భూపాల్ రెడ్డి, నాయకులు దొండపాటి అప్పిరెడ్డి, చక్రధర్ రావు, నరాల కొండారెడ్డి ,నందదిరెడ్డి ,ఇంద్రారెడ్డి, దేవి రెడ్డి లక్ష్మారెడ్డి రంగాచారి తదితరులు పాల్గొన్నారురని