–ఏప్రిల్ 14 నుండి అమలులోకి రానున్న చట్టం
–అంబెడ్కర్ జయంతి రోజున ఉత్త ర్వులు
–దశాబ్దాల డిమాండ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చజెండా
— మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఏప్రిల్ 14 నుండి ఎస్సీ వర్గీకరణ అమలు లోకి రానుందని రాష్ట్ర నీటిపారుద ల, పౌర సరఫరాల శాఖామంత్రి కె ప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్ర కటించారు.భారత రాజ్యాంగ ని ర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబె డ్కర్ జయంతి రోజున రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చే యనున్న ట్లు ఆయన వెల్లడించారు
దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి రాగానే అమలులోకి తెచ్చామని ఆయన తెలిపారు.
ఆదివారం రోజున డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై వేసిన మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశ మైన మంత్రివర్గ ఉపసంఘం ఎస్సీ వర్గీకరణ చట్టానికి తుది రూపం ఇ చ్చినట్లు ఆయన తెలిపారు.
మంత్రివర్గ ఉపసంఘం ఆమోదిం చిన ఎస్సి వర్గీకరణ తొలి ప్రతిని డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ జయం తిని పురస్కరించుకుని సోమవా రం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి అందజేయ నున్న ట్లు ఆయన పేర్కొన్నారు.
మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సబ్ కమిటీ ఉపాధ్యక్షుడు దామో దరం రాజ నరసింహ, పొన్నం ప్రభా కర్, సీతక్క లతో పాటు ఎస్సీ వర్గీ కరణ ఒన్ మెన్ కమిషన్ కు అధ్య క్షత వహించిన రిటైర్డ్ న్యాయ మూ ర్తి జస్టిస్ షమీమ్ అక్తర్,ఎస్.సి అ భివృద్ధి శాఖా ముఖ్య కార్యదర్శి శ్రీ దర్,న్యాయశాఖ కార్యదర్శి తిరు పతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జస్టిస్ షమీమ్ మక్తర్ ఆధ్వర్యంలో కమిషన్ రూపొందించిన సిఫారసు లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం వర్గీకరణ చట్టాన్నీ ఆమోదించినట్లు ఆయన చెప్పారు.ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ను 59 ఎస్సీ ఉప కులాల మధ్యన ఉన్న అంతర్గత వెనుకబాటు తనా న్నీ ఆధారం చేసుకుని మూడు గ్రూ పులుగా విభజించినట్లు ఆయన తెలిపారు.
మొదటి గ్రూప్ లో 15 ఉప కులా లు అత్యంత వెనుకబాటు తనంలో ఉండగా,ఆ 15 కులాల జనాభా 3.288 శాతంగా ఉన్నట్లు గుర్తించి నట్లు ఆయన చెప్పారు.ఆ జనాభా ఆధారంగా వీరికి ఒక్క శాతం రిజ ర్వేషన్లు వర్తింప జేయాలని నిర్ణ యించినట్లు ఆయన తెలిపారు
అదే విదంగా రెండవ గ్రూప్ లో రిజర్వేషన్ల ఆధారంగా అంతంత మాత్రం లబ్దిపొందిన ఉప కులాలు 18 ఉన్న్నాయని ఎస్సీ జనాభాలో ఈ 18 కులాల జనాభా 62.74 శా తంగా ఉన్నందున వీరికి 9 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు ఆ యన తెలిపారు.
ఇక మూడో గ్రూప్ లో పై రెండు గ్రూ ప్ లతో పోల్చి చూసినప్పుడు ఒకిం త ముందున్న 26 కులాల జనాభా 33.963 ఉండగా వారికి 5 శాతం రిజర్వేషన్లను కేటాయించినట్లు ఆ యన చెప్పారు. ఎస్సీ వర్గీకరణ పై భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిం చి జస్టిస్ షమీమ్ అక్తర్ ఎక్కసభ్య కమిషన్ చైర్మన్ గా నియమించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
కమిషన్ వేసిందే తడవుగా ఎస్సీ ఉప కులాల సామాజిక ఆర్ధిక స్థితి గతులపై లోతుగా అధ్యయనం చే యడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 8,600 పైగా వినతులు స్వకరిం చినట్లు ఆయన వివరించారు.
అంతే గాకుండా ఎస్సీ కులాల జ నాభా ఆర్ధిక, ఉద్యోగ, ఉపాధి, వి ద్యా అవకాశాలపై సమగ్రమైన సమాచారాన్ని తీసుకున్నట్లు ఆ యన తెలిపారు.
అదే సమయంలో వివిధ వర్గాల నుండి అభ్యంతరాలు రావడంతో కమిషన్ గడువు వ్యవధిని అదనం గా మరో నెల పెంచి అందరి అభి ప్రాయాలను సేకరించినట్లు ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ తరువాత క్రమంలో కొత్తగా ఏ ర్పడ్డ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ దశాబ్దా లుగా నానుతూ వచ్చిందన్నారు.
సుదీర్గ కాలంగా చట్టసభలలో ప్రా తినిధ్యం వహించిన తాను ఈ అం శాన్ని 1999 ప్రాంతంనుండి ప్రతీ శాసనసభ సమావేశాలలో ప్రత్య క్షంగా చూశానన్నారు. అదే ఎస్సీ వర్గీకరణ పై మొన్నటి శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వర్గీకరణ ను ఖచ్చితంగా అమలులోకి తెస్తా మని స్పష్టమైన హామీ ఇచ్చిన విష యాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మే రకు రాష్ట్రంలో అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వ ర్గీకరణకు చట్టబద్దత కల్పించి చిత్త శుద్ధిని చాటు కున్నామన్నారు.
అం దుకు అనుగుణంగానే తెలం గాణా శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ను ఏకగ్రీవంగా ఆమోదించుకో వ డంతో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదించిన విషయాన్ని ఆయన ఉటంకించారు
అదే సమయంలో కమిషన్ ప్రతి పాదించిన క్రిమిలేయర్ ప్రతిపాద నను సైతం తిరస్కరించినట్లు ఆ యన తేల్చి చెప్పారు. ఆర్థిక ప్రమా ణాల ఆధారంగా ఉప కులాల హ క్కులను హరిస్తే ఏర్పడబోయే పరి ణామాలను గమనించిన మీదట వర్గీకరణ ధర్మబద్ధంగా ఉండేలా తుది రూపు నిచ్చినట్లు ఆయన చెప్పారు.2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణాలో ఎస్సీ ల జనాభా 17.5 శాతానికి చేరిందని 2026 జనాభా లెక్కలను పరిగ ణనలోకి తీసుకుని ప్రస్తుతం ఎస్సీ లకు ఉన్న 15 శాతం రిజర్వేషన్లను పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.