–మంత్రి ఉత్తమ్ చొరవతో హుజుర్ నగర్, కోదాడలకు రూ.49 కోట్ల 59 లక్షలు మంజూరు
Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రాతినిధ్యం వహి స్తున్న కోదాడ హుజూర్నగర్ నియో జకవర్గం మహర్దశ పట్టుకుంది. ఆ నియోజకవర్గ ప్రజలకు తీపి కబు రు అందిస్తూ అభివృద్ధికి ఆన వా ళ్లుగాగా నిలిచారు మంత్రి ఎన్.ఉ త్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి పను లపై తనదైన శైలిలో మరోమారు కెప్టెన్ మార్క్ వేసుకున్నారు. ఇప్ప టికే కోదాడ,హుజుర్నగర్ నియోజక వర్గాలలో అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన పాఠశాలల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పాఠశాలల కు రవాణా సౌకర్యం మెరుగు పరి చేందుకు గాను ఏక కాలంలో డబు ల్ రోడ్ నిర్మించేందుకు గాను 30 కోట్ల ఆర్&బి నిధులను ఆయన మంజూరు చేయించారు.
అంతే గా కుండా హుజుర్నగర్ పట్టణం రాజీ వ్ గాంధీ జంక్షన్ నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హౌజింగ్ బోర్డు కాలనీ వరకు ఉన్న రహదారి ఆధునికీకరణకు గాను 6 కోట్ల 50 లక్షలను ఆయన మంజూరు చేశా రు. వీటితో పాటు హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో నూతనం గా నిర్మించ తల పెట్టిన నీటిపారు దలశాఖా డివిజనల్ కార్యాల యానికి 7 కోట్ల 99 లక్షలతో పాటు కోదాడ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించ తల పెట్టిన నీటిపారుదల శాఖా సూపరెండేంట్ ఇంజినీర్ సర్కిల్ కార్యాలయానికి 5 కోట్ల 10 లక్షల నిధులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా మంజూరు చేయించారు.