Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్య, ప్రతి పేదవాడి కడుపునిం పడమే ప్రజా ప్రభుత్వం సంకల్పం
Minister Uttam Kumar Reddy :ప్రజా దీవెన, హుజూర్ నగర్: నిరు పేదలకు ఉచితంగా నాణ్యమైన స న్నబియ్యం పంపిణీని మించిన సం క్షేమం మరొకటి ఉండబోదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శా ఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమా ర్ రెడ్డి స్పష్టం చేశారు.అటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రామా న్ని హుజుర్ నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభించుకోవడం ఆనంద దాయకమని ఆయన పేర్కొన్నారు
మంగళవారం రోజున హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి న ల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూ రి లక్ష్మణ్ కుమార్ తో కలసి ఆయన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ నిరంత ర ప్రక్రియ అన్నారు
కోటాను కోట్లు ఖర్చు పెట్టి దొడ్డు బి య్యం పంపిణీ చేసినా ప్రజలు విని యోగించుకునేందుకు అయిష్టత చూపడంతో అవి పక్క దోవ పట్టా యన్నారు. ప్రజాభీష్టానికి అనుగు ణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్కతో సహా మంత్రివర్గ సమిష్టి నిర్ణయంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నా రు. స్వతంత్ర భారత దేశంలోనే స న్నబియ్యాన్ని ఉచితంగా పేదలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగా ణ మాత్రమేనని ఆయన పేర్కొన్నా రు.
అర్హులైన ప్రతి ఒక్కరికి నిబంధన లననుసరించి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పేదలను నిర్లక్ష్యం చేసారని ఆయన మండిప డ్డారు. అర్హులైన వారెవరికి బిఆర్ ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు అందించలేక పోయారని ఆయన విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి వచ్చాక ఏక కాలంలో 7 లక్షల 95 వేల 685 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు
తద్వారా కొత్తగా 33 లక్షల 97 వేల 367 మందికి లబ్ది చేకూరిందని ఆ యన వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నా టికి 89 లక్షల కార్డులతో 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా ప్రస్తు త ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య 3 కోట్ల 78 లక్షల 367 మందికి చే రిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడినా ఖాతరు చేయకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి నిరుపేద కడుపు నింపేందుకే కాంగ్రె స్ పార్టీ ప్రభుత్వం ఇంతటి సాహ సోపేత నిర్ణయం తీసుకున్న విష యాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఆయ న కోరారు.
హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా మా రిందన్నారు.మొన్నటి లోకసభ ఎ న్నికల్లో యావత్ భారతదేశంలోనే హుజుర్నగర్ నియోజకవర్గంలో లక్ష ఓట్లు సాధించి సరికొత్త రికార్డు న మోదు చేసుకుందని ఆయన చె ప్పారు.కాంగ్రెస్ పార్టీకీ,ప్రభుత్వానికి కార్యకర్తలే మూలస్తంభాలన్నారు.
ఎత్తిపోతల పథకాలతో హుజుర్ నగర్,కోదాడ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామన్నారు.
18 ఏళ్ల తరువాత జులై నెలలో నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేశామ న్నారు.సాగర్ ఆయాకట్టు రైతాంగం ఆశీర్వాదాలతోటే తాను ఆరుసార్లు శాసనసభకు ఒక మారు లోకసభకు ఎన్నికయ్యమన్నారు. అటువంటి రై తాంగం ఆశీర్వాదాలతో నీటిపారు దల శాఖామంత్రిగా సాగర్ నీటి వి డుదల చేయడం తన అదృష్టమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొ న్నారు.పౌరసరఫరాల శాఖా ప్రధాన కార్య దర్శి డి ఎస్ చౌహన్ తదితరు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.