*మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతిని కలిసిన వినతి పత్రం అందజేసిన తమ్మర నాయకులు
Minister Uttam: ప్రజా దీవేన, కోదాడ: కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తమ్మరలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి సహకరించాలని తమ్మర అఖిలపక్ష నాయకులు బుధవారం హైదరాబాదులో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రధానంగా తమ్మరలో నెలకొన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. తమ్మర పిఎసిఎస్ ను కోదాడలో కలపడం వలన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోదాడ నుంచి తొలగించి తమ్మరలోనే పిఎసియస్ కొనసాగే విధంగా చూడాలన్నారు.
రెండవ భద్రాద్రిగా పేరుందిన తమ్మర రామాలయం కళ్యాణమండపం నిర్మించి, కోనేరును పునరుద్ధరించాలన్నారు. డ్రైనేజీలు,సిసి రోడ్లు పూర్తిస్థాయిలో నిర్మించాలని కోరారు. అనంతరం సీతారామచంద్ర స్వామి జ్ఞాపికను బహుకరించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సామినేని నరేష్, బొల్లు ప్రసాద్, కనగాల రాధాకృష్ణ, కనగాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.