Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ అల్టిమేటం, ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంచడంపై ఆగ్రహం, న దీ జలాల పంపిణిలో న్యాయం జరి గేవరకు పోరాటం

Minister Uttam Kumar Reddy : ప్రజాదీవెన, సూర్యాపేట: కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి డ్యాం ఎత్తు పెం చడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ,ఈ విష యంలో తెలంగాణకు న్యాయం జరి గేంత వరకు పోరాడుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు 7 0 శాతం జలాలు కేటాయించాలని పోరాడుతున్నామని, ఇప్పటికే ఒక సారి ట్రేబ్యునల్ ముందు వాదనలు వినిపించామని, తిరిగి సోమవారం రాత్రి మరోసారి ఢిల్లీ వెళ్లి తెలంగా ణాకు న్యాయం జరిగేలా వాదనలు వినిపిస్తామని మంత్రి తెలిపారు.

ఆదివారం ఆయన సూర్యాపేట జి ల్లా పాలకీడు మండలం జాన్ పహ డ్ గ్రామంలో కృష్ణా నదిపై నిర్మిస్తు న్న జవహర్ జాన్ పహడ్ లిప్ట్ ఇరి గేషన్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురో గతిని పరిశీలించారు.

కృష్ణా నది జలాల పంపకంలో గత పాలకులు పదేళ్ల నిర్లక్ష్యం చేయటం తో కృష్ణా నదిలోని 811 టిఎంసిల లో ఆంధ్రకి 512 టిఎంసిలు తెలం గాణ కి 299 టి యమ్ సి లకి వ్రాత పూర్వకంగా ఒప్పుకున్నారని, కానీ తాము అధికారంలోకి వచ్చాక నదీ పరివాహక ప్రాంతం,ఆయకట్టు, జ నాభాను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలని కో రడం జరిగిందని గుర్తు చేశారు. తు మ్మడిహట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు దృఢ సం కల్పంతో ఉన్నామని త్వరలో కా ర్యాచరణ మొదలు పెడతామని తెలిపారు.

గత పాలకులు లక్ష కోట్లతో కాళేశ్వ రం పేరుతో 3 బ్యారేజ్ లు నిర్మిస్తే మూడేళ్ళకే కూలిపోయాయని య న్ డిఎస్ఎ నివేదిక ప్రకారం బ్యారేజ్ పునరుద్దరణ పనులు చేసేందుకు ముందుకు వెళ్తామని మంత్రి వెల్ల డించారు.ఈ ప్రాంతం నుండి 6 సా ర్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 7 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉ న్నానని ఈ ప్రాంత ప్రజలు చూ యించే ప్రేమానురాగాలకు కృతజ్ఞ తగా ఉంటానని, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ,మహిళల జీవితాలను మె రుగుపడేందుకు 24 గంటలు కృషి చేస్తున్నానని చెప్పారు. తను ఎ క్కడ ఉన్నా కోదాడ, హుజూర్ నగ ర్ నియోజకవర్గాల్లో అభివృద్ధిపై ప్ర తిరోజు ఒక గంట సమీక్ష నిర్వహిం చేలా దినచర్య ఉంటుందని ఈ సం దర్భంగా మంత్రి తెలిపారు.

జవహర్ జాన్ పహాడ్ లిప్ట్ ఇరిగేష న్ పనులు యుద్ధ ప్రాతిపదికన వేగ వంతంగా, నాణ్యత పాటిస్తూ పూర్తి చేయాలని మంత్రి కాంట్రాక్టర్ ను ఆదేశించారు.ఈ ప్రాంత ప్రజల కో రి క మేరకు జాన్ పహాడ్ లిప్ట్ ఇరిగే షన్ స్కీంను 302 కోట్ల రూపాయ లతో నిర్మించటం జరుగుతున్నదని, దీని ద్వారా అలింగాపురం, రాఘవ పురం, బొత్తల పాలెం, కోమటికుం ట,మీగడం పాడు తండా, చెరువు తండా, హను మాయగూడెం, పాల కీడు, సజ్జాపురం, నాగిరెడ్డి గూడెం గ్రామాలలోని 10,000 ఎకరాలకి సాగునీరు అలా గే జాన్ పహాడ్ చెరువుకి నీరు అందించటం జరు గుతుందని తెలిపారు.

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబం ధించిన భూసేకరణ లో రైతులకు న్యాయం జరిగేలా పూర్తి చేయాలని ఆర్డీఓ ను ఆదేశించారు.డిసెంబర్ చివరి నాటికి జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే పదివేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సి ద్ధం చేసుకోవాలని మంత్రి కాంట్రాక్ట ర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ ఈయన్ సి రమేష్ బా బు, సూర్యాపేట జిల్లా ఎస్పి నరసిం హ, ,ఆర్డివో శ్రీనివాసులు,ఇరిగేషన్ ఎస్ ఈ నాగ భూషణం, డి ఈ స త్యనారాయణ, హరి కిషోర్,ఏఈ స తీష్, కాంట్రాక్టర్ శ్రీనివాస్, ఇతర అ ధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.