Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Vakkiti Srihari : మంత్రి వాకిటి శ్రీహరి వాంఛనీయం, క్రీడాపాఠశాలలు పతకాల సాధన ప రిశ్రమలుగా మారాలి

Minister Vakkiti Srihari : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు, అకాడమీలు పతకాలు సాధించే పరిశ్రమలుగా మారాలని రాష్ట్ర క్రీ డా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అ ధికారులను ఆదేశించారు. 2025– 26 విద్యా సంవత్సరానికి పారదర్శ కంగా, ప్రతిభ ఆధారంగా విద్యార్థు ల ఎంపిక జరగాలని స్పష్టం చేశా రు. ఎల్బీ స్టేడియంలో చైర్మన్ శివసే నారెడ్డి తో కలిసి ఆయన రాష్ట్రం లో lని స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీల పనితీరు, సవాళ్లు, భవిష్యత్ ప్రణా ళికపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు.

 

ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మా ట్లాడుతూ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూ ల్‌తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ స్కూళ్లలో ఆధునిక క్రీడా శిక్షణ, వి ద్యలో మెరుగుదల సాధించాలని అధికారులకు సూచించారు. హకీం పేట్‌లో తక్షణ మరమ్మతులు, అన్ని స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పా టు చేయాలని ఇంజనీరింగ్ అధికా రులను ఆదేశించారు.స్పోర్ట్స్ అథా రిటీ అకాడమీల పని తీరు మెరు గుపరిచి విద్యార్థి క్రీడాకారుల్లో స్ఫూ ర్తిని కలిగించే కార్యక్రమం నిర్వ హిం చాలని కోరారు.

 

స్పోర్ట్స్ స్కూల్లో అకాడమీ లలో త్రైమాసికంగా బ్యాటరీ టెస్టులు నిర్వహించి , కంప్యూటరైజ్డ్ రిపో ర్టులు తయారుచేసి విద్యార్థుల త ల్లిదండ్రులకు పంపించే విధంగా ఏ ర్పాటు చేయాలని ఆయన అధికా రులను కోరారు.ప్రతిభ ఆధారంగా విద్యార్థుల వర్గీకరణ (A–F) చేసి క్రీడా ప్రతిభ లేని వారిని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లకు బదిలీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయ న అధికారులను ఆదేశించారు.

స్పోర్ట్స్ స్కూల్లో పనిచేసే అధి కా రులు సిబ్బంది కోర్సులు అందరూ విద్యార్థుల సంక్షేమం కోసం తమ పిల్లలుగా చూసుకోవాలని వారికి ఇబ్బందులు రాకుండా వారి యో గక్షేమాలు చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రేరణాత్మక తరగతులు, వ్యక్తిత్వ వికాస అంశా ల్లో శిక్షణ యోగ శిక్షణ తప్పనిసరి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

 

తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు సాధించిన విజయాలను ప్రదర్శిం చేందుకు ప్రతి స్పోర్ట్స్ స్కూల్ అకా డమీల్లో విద్యార్థుల తల్లిదండ్రుల కొ రకు విజిటర్స్ హాల్స్ ఏర్పాటు చే యాలని ఆయన ఆదేశించారు.

 

ఎల్.బి. స్టేడియంలో వీడియో కా న్ఫరెన్స్ హాల్ నిర్మాణం చేసి అన్ని అకాడమీలను స్పోర్ట్స్ స్కూల్ ల లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను ఈ కాన్ఫరెన్స్ వాళ్లకు అనుసందిం చాలని తెలిపారు.క్రమం తప్పకుం డా క్రీడా శాఖలోని అన్ని విభాగాల పై నిరంతరం సమీక్షలు చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్లో అకా డమీల పనితీరు మెరుగుపరచ డమే కాకుండా అన్ని అంశాలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుం టూ సమగ్ర క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. విధు ల్లో అలసత్వం వహించే ఎవరిని కూడా ఉపేక్షించమని మంత్రి శ్రీహరి తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పో ర్ట్స్ అథారిటీ చైర్మన్ కె. శివసేన రె డ్డి, తో పాటు హకింపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి టి. మమ త, డిప్యూటీ డైరెక్టర్లు జి చంద్ర రెడ్డి జి. రవీందర్, డా. రవి శంకర్ పల్లె ల, , ఎస్.ఎం. బాషా, జి. అశోక్ కు మార్, పి. సందీప్ కుమార్, సురేష్ కాలేరు తదితరులు ఈ సమీక్ష స మావేశంలో పాల్గొన్నారు.