Minister Venkat Reddy : మంత్రి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్య, లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు ధృఢసంకల్పం
Minister Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ:బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ ను రాష్ట్ర రో డ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శని వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజర్వాయర్ లో రెండు పంపుల ద్వారా ఇప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటి నిల్వలపై అధికారులను ఆరా తీశారు. ఉదయ సముద్రం నుండి ఇప్పటి వరకు 0.20TMC నీటిని లిఫ్ట్ చేశామని అధికారులు మంత్రికి వివరించారు. నాగార్జున సాగర్ లో నీటిమట్టం పెరుగుతున్నందున రెం డు పంపుల ద్వారా ఒక్కో పంపు 4 60క్యూసెక్కుల కెపాసిటీ చొప్పున రోజుకు 920 క్యూసెక్కుల నీటిని ఉదయ సముద్రం నుండి లిఫ్ట్ చేసి రిజర్వాయర్ ఫుల్ లెవల్ 0.305 TMC వరకు నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
రిజర్వాయర్ కింద చెరువులు నింపి సాగు నీరు అందించేందుకు ఏర్పా టు చేసుకుంటున్న లెఫ్ట్,రైట్ కెనాల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. లెఫ్ట్ మె యిన్ కెనాల్ ద్వారా 30చెరువులు, రైట్, మెయిన్ కెనాల్ ద్వారా 20చె రువులు నింపేందుకు వీలుగా వర్క్ ఏజెన్సీలు యుద్ద ప్రాతిపదికన కె నాల్ పనులు పూర్తి చేయాలన్నా రు. రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించే ఫీడర్ చానెల్ కెనాల్ తవ్వకానికి ఎస్టిమేట్స్ రూపొందిం చాలని అధికారులను ఆదేశించా రు.
నల్గొండ మండలం దోమలపల్లి గ్రా మ చెరువు అతి త్వరలో సుమా రుగా 10రోజుల్లో నింపి సాగు నీరు అందించేందుకు నిర్విరామంగా పని చేయాలని కెనాల్స్ పినిషింగ్ వర్క్స్ వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రాజె క్ట్ కింద భూసేకరణ ద్వారా భూమి కోల్పోయిన రైతుల ఖాతాల్లో వెంట నే పరిహారం డబ్బులు జమ చేయా లని ఆర్డీవో,అడిషనల్ కలెక్టర్ ను ఫోన్లో ఆదేశించారు.
గత డిసెంబర్ లో ప్రారంభించుకు న్న ఈ రిజర్వాయర్ ద్వారా ఇప్పటి వరకు 15వేల ఎకరాలకు సాగు నీ రు అందించామని,లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే తన ధృఢ సంకల్పమని మంత్రి పునరుద్ఘాటిం చారు.మంత్రి ఆకస్మిక తనిఖీ కి వెళ్లి నప్పుడు ఫీల్డ్ విజిట్ లో ఉన్న ఇ రిగేషన్ ఇంజనీర్లను ఈ సందర్భం గా అభినందించారు. రైతు పట్ల ప్ర తి ఒక్కరూ కమిట్మెంట్ తో పనిచే యాలని వారికి సూచించారు.
ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా నల్గొండ ఇరిగేష్ ఈ.ఈ శ్రీనివాస్ రెడ్డి, డి.ఈ విఠలేశ్వర్,డిప్యూటీ డి.ఈ పిచ్చయ్య,ఏ.ఈఈలు రాజశేఖర్,నవీన్,జితేందర్ తో పాటు మంత్రి వెంట పలువురు ఉన్నారు.